భారీ ఇమేజ్, స్టార్ డమ్ ఉన్న హీరో, టాప్ డైరక్టర్ తో కలసి సినిమా చేస్తే ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ట్రేడ్, బిజినెస్ సర్కిల్స్ లో ఆసక్తి, బిజినెస్ పెరుగిపోతుంది. టాలీవుడ్ నెంబర్ వన్ హీరో మెగాస్టార్ చిరంజీవి, టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఇదే జరుగుతుంది. మాస్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసేది ఒకరు.. డైలాగ్ లతో పూనకాలు తెప్పించేది మరొకరు. తన తిరుగులేని మాస్ ఇమేజ్ కు తోడు, డ్యాన్సులు, ఫైట్లు, అద్భుతమైన కామెడీ టైమింగ్ మెగాస్టార్ సొంతం.

 

 

పెద్దగా కామెడీ ట్రాక్ లేకపోయినా తానే కామెడీ పండించగల సత్తా చిరంజీవి సొంతం. ఇదే స్థాయి కామెడీ పంచులు వేయడంలోనూ, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. చంటబ్బాయి, దొంగమొగుడు, జేబుదొంగ, యముడికి మొగుడు, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానామొగుడు, అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్.. వంటి సినిమాల్లో చిరంజీవి కామెడీ టైమింగ్ ఇప్పటికీ ఓ అద్భుతం. త్రివిక్రమ్.. మన్మధుడు, జల్సా, ఖలేజా సినిమాల్లోని కామెడీ టైమింగ్.. అతడు, అత్తారింటికి దారేది, అఆ, అల.. వైకుంఠపురములో సినిమాల్లోని ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి.

 

 

చిరంజీవి స్థాయి కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే త్రివిక్రమ్ పెన్నుకు పదును పెట్టాల్సిందే. ఖచ్చితంగా మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. ఆమధ్య చిరంజీవి ఓ ఫంక్షన్ లో తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో ఉంటుందని అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ ఎంతో ఆసక్తి రేపింది కూడా. మరి త్రివిక్రమ్ ఎప్పుడు తన కథాంశంతో చిరంజీవిని మెప్పించి సినిమా తీస్తాడో చూడాలి. చిరంజీవి నుంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా వస్తే ప్రేక్షకాభిమానులకు పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి: