భారతదేశంలో కరోనా రోజురోజుకి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది మర్కాజ్ సంఘటన కారణంగానే ఇప్పుడు పరిస్థితి అంటూ ఒక వర్గం వారిని టార్గెట్ చేసి చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం మొదటి నుంచి దుస్థితికి ఒకరిని లేదా ఒక మతాన్ని టార్గెట్ చేసి ఎటువంటి ఆరోపణలు చేయవద్దని విన్నవిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి తాజాగా సోషల్ మీడియాలో ఒక వర్గం వారికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసింది.

 

అయితే రంగోలి వ్యాఖ్యలను అభ్యంతరకరంగా పరిగణించిన సదరు సోషల్ మీడియా సంస్థ ఆమె ఖాతా ను సస్పెండ్ చేసింది. దీనితో తన చెల్లెలు అకౌంట్ ను సస్పెండ్ చేయడం పై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించవలసి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఒక ముస్లిం కుటుంబానికి వైద్య పరీక్షలు చేసేందుకు అక్కడికి వెళ్ళిన డాక్టర్లు మరియు పోలీసులపై కొంతమంది దాడికి ప్రయత్నించారు. దానికి సంబంధించిన వీడియోను కంగనా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విషయం గురించి రంగోలి ప్రస్తావించగా ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేశారు అంటూ కంగనా తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది.

 

రంగోలి వ్యాఖ్యలు మరియు కంగనా ఆమెకు మద్దతు తెలపడంపై ముంబయికి చెందిన అలీ కాపిఫ్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు అక్క చెల్లెల్లు సమాజంలో రెండు వర్గాల మద్య గొడవలు సృష్టించేలా, మారణహోమంకు దారితీసేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అతడు తీవ్రమైన ఆరోపణలతో కేసు పెట్టాడు. కేసు కనుక నిరూపితమైతే ఇద్దరికీ కనీసం రెండు నుండి మూడున్నరేళ్ళ జైలు శిక్ష ఖాయం అన్నది న్యాయ నిపుణుల అంచనా. అతడి కేసును నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిద్దరి సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: