కోలీవుడ్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ హీరోయిన్ గా టాలెంట్ చూపిస్తుంది. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు మైఖేల్ కోర్సలేతో డేటింగ్ అంటూ తిరిగిన శృతి హాసన్ అతని నుండి విడిపోయి ఇప్పుడు మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టాలని చూస్తుంది. రీ ఎంట్రీలో ఇప్పటికే తెలుగులో రెండు క్రేజీ సినిమాలు చేస్తుంది శృతి హాసన్. అందులో మాస మహారాజ్ రవితేజతో చేస్తున్న క్రాక్ సినిమా ఒకటి కాగా మరోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ లో కూడా అమ్మడు నటిస్తుంది. 

 

అయితే తెలుగులో ఇలా ఉంటే శృతి హాసన్ ను తమిళ స్టార్ హీరో పిలిచి మరి అవకాశం ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. తమిళంలో తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి తన నెక్స్ట్ సినిమా లాభం టైటిల్ తో వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ వేట కొనసాగుతుండగా శృతి హాసన్ ను తీసుకుందామని విజయ్ సేతుపతి సలహా ఇచ్చాడట. చిత్రయూనిట్ కూడా అందుకు ఓకే చెప్పారట. వెంటనే శృతితో డిస్కస్ చేసి ఆమెను ఓకే చేసినట్టు తెలుస్తుంది. 

 

తెలుగులో సినిమా ఛాన్స్ వస్తే చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది కానీ తమిళంలో వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తుంది శృతి హాసన్. టాలీవుడ్ లో కూడా ఆమె కమిట్మెంట్ ఇచ్చినా ఆమె చేసేంత వరకు కష్టమన్న బ్యాడ్ టాక్ వచ్చింది. ముందు శృతి హాసన్ ఓకే చెప్పడం ఆ తర్వాత ఏవేవో కారణాలు చెప్పి మధ్యలో సినిమా వదిలేయడం శృతి హాసన్ కు అలవాటైంది. ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలకు అమ్మడు ఇలాంటి షాకులు చాలానే ఇచ్చింది అందుకే శృతితో సినిమా అంటే రిస్క్ అంటూ ఫీల్ అవుతున్నారు. అయితే తమిళంలో మాత్రం సినిమాకు ఓకే చెబితే అయ్యేదాకా కోపరేట్ చేస్తుంది. మరి అమ్మడు తెలుగు సినిమాలపై ఈ చిన్నచూపు ఎందుకో ఆమెకే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: