టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తేనే థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఒకటి సూపర్ స్టార్ మహేష్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను మూవీ. భద్ర నుండి వినయ విధేయ రామ వరకు బోయపాటి శ్రీను సినిమా చూస్తే ఒక పవర్ ఫుల్ ఎనర్జీ పాస్ అయినట్టే ఉంటుంది. హీరోల ఇమేజ్ ను రెట్టింపు చేసే సత్తా ఉన్న దర్శకులలో బోయపాటి శ్రీను ఒకడు. అందుకే అతనితో సినిమా కోసం స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. 

 

ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసిన బోయపాటి శ్రీను బాలయ్యకు మాత్రం పక్కా హిట్టు ఇస్తాడన్న సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణతోనే సినిమా సెట్స్ మీద ఉంది. ఇక బోయపాటి శ్రీనుతో మహేష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో మహేష్ తో తాను సినిమాకు సిద్ధమని చెప్పాడు బోయపాటి శ్రీను.. మహేష్ తో సినిమా మాములుగా ఉండదని కూడా అన్నాడు. మరి ఏమైందో ఏమో కాని ఇంకా ఆ సినిమా అటకెక్కేసింది.

 

బోయపాటి శ్రీను సినిమా వస్తే బోయపాటి శ్రీను పండుగ చేసుకుంటారు. అలంటి బోయపాటి డైరక్షన్ లో మహేష్ సినిమా అంటే రికార్డుల మోత మోగాల్సిందే. బాక్సులు బద్దలయ్యే కాంబినేషన్ ఇది కాబట్టి త్వరలో ఈ కాంబో సెట్ అవ్వాలని ఆశిద్దాం. ఖచ్చితంగా రెండు మూడు సినిమాల తర్వాత అయినా బోయపాటితో మహేష్ సినిమా పక్కా ఉంటుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అప్పటివరకు ఏ రికార్డులు ఉన్నా అవన్నీ ఈ సినిమాతో ఖల్లాస్ అవడం ఖాయం. ఈ కాంబో త్వరలోనే సెట్ అవ్వాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: