టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సినిమా విడుదల అవుతుంది అనగానే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలో ఆయన నటన కు ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. విమర్శకుల ప్రసంశలు అందుకునే స్థాయిలో బాలకృష్ణ నటన ఉంటుంది అనేది వాస్తవం. బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. హీరో అంటే ఇలా ఉండాలి అనే విధంగా కూడా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది హీరోయిజం. 

 

అలాంటి బాలకృష్ణ విలన్ అయితే... చాలా మందికి షాకింగ్ గా ఉంటది. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు దాన్ని జీర్ణించు కునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బాలయ్య ను ఒక స్థాయిలో చూసి హీరోగా పది మందిని కొట్టడం ఆయన ఫాన్స్ ఇష్టపడుతూ ఉంటారు. కాని ఈ మధ్య కాలంలో గాని అంతకు ముందు గాని బాలయ్య పూర్తి స్థాయి విలన్ గా నటించింది లేదు. ప్రేక్షకులు కూడా ఆయన విలన్ గా నటిస్తే బాగుంటుంది అది కూడా జూనియర్ ఎన్టీఆర్ కి విలన్ గా నటిస్తే బాగుంటుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు 

 

వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా బాలకృష్ణ ను విలన్ గా చూస్తే బాగుంటుంది అనే అభిప్రాయం తో కూడా ఉన్నారని అంటారు. ముఖ్యంగా బాలకృష్ణ నటన అసలు విలన్ పాత్రలో ఏ విధంగా ఉంటారో చాలా మందికి బాలకృష్ణ అంటే హీరో అనే గాని విలన్ గా అసలు వాళ్ళు ఊహకు కూడా అందానిచ్చే పరిస్థితి ఉండదు. మరి బాలయ్య విలన్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: