ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే రెండున్న‌ర ద‌శాబ్దాల నుంచి తెలుగు సినిమా వాళ్ల‌కు ఓ పిచ్చి.. ప‌వ‌న్ ఓ సంచ‌ల‌నం.. ఓ ప్ర‌భంజ‌నం.. ప‌వ‌న్ ఏది చేస్తే అది స్టైల్‌.. ఏది మాట్లాడితే అది డైలాగ్ అన్నది కామ‌న్‌. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస హిట్ల‌తో దూసుకు పోయాడు. తొలి సినిమా నుంచి గోకులంలో సీత‌, సుస్వాగ‌తం, త‌మ్ముడు, బ‌ద్రి, ఖుషీ ఇలా ఒక‌దానిని మించి మ‌రొక‌టి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. 2001లో వ‌చ్చిన ఖుషీ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ రెండేళ్ల పాటు సినిమాలు చేయ‌లేదు. ఆ త‌ర్వాత గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై త‌న సొంత ద‌ర్శ‌క‌త్వంలో జానీ సినిమా చేశాడు.

 

అల్లు అర‌వింద్ నిర్మించిన ఈ సినిమాలో క‌థ ప‌రంగా మంచి విలువ‌లు ఉన్నా కూడా ప‌వ‌న్‌కు డైరెక్ష‌న్‌పై గ్రిప్ లేక‌పోవ‌డంతో, క‌థ‌నాలు ప్రేక్ష‌కుల‌కు అర్థం కాక‌పోవ‌డం.. అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను ఓ యూత్ ఐకాన్‌గా ఊహించుకున్న జ‌నాల‌కు భిన్నంగా సినిమా ఉండ‌డం.. క‌న్ ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, గంద‌ర‌గోళమైన క‌థ‌నం.. నీర‌సంగా సాగే నెరేష‌న్ ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెట్టాయి. ఇక బ‌ద్రి సినిమాలో త‌న‌తో పాటు హీరోయిన్‌గా న‌టించిన రేణు దేశాయ్ ఈ సినిమాలో హీరోయిన్‌.

 

భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయ్యింది. ఓ విధంగా చెప్పాలంటే ప‌వ‌న్ తిరుగులేని దూకుడుకు ఈ సినిమా ఓ విధంగా బ్రేక్ వేసింద‌నే చెప్పాలి. అలా ఈ సినిమా వ‌చ్చి ఈ రోజుతో ఏకంగా 17 సంవ‌త్స‌రాలు అయ్యింది. అయితే ర‌మ‌ణ గోగోలు స్వ‌ర‌ప‌ర్చిన పాట‌లు మాత్రం ఎప్ప‌ట‌కీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో అలా నిలిచిపోయాయి. ఆ త‌ర్వాత ప‌వ‌న్ మ‌ళ్లీ రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకుని చేసిన గుడుంబా శంక‌ర్ కూడా ప్లాప్‌. జానీ త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా వ‌ర‌కు స‌రైన హిట్ లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: