టాలీవుడ్ లో కొన్ని కాంబినేష‌న్ల కోసం ప్రేక్ష‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి కాంబినేష‌న్ల‌లోనే నంద‌మూరి త్ర‌యం హీరోలు అయిన యువ‌త‌ర్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ ముగ్గురు హీరోల కాంబినేష‌న్లో సినిమాల కోసం గ‌త ఇర‌వై ఏళ్లుగా నంద‌మూరి అభిమానులే కాకుండా యావ‌త్ టాలీవుడ్ సినిమా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు సినిమాలో క‌ళ్యాణ్ రామ్ చేసిన చిన్న పాత్ర మిన‌హా ఈ హీరోల కాంబినేష‌న్ ఎప్పుడూ తెర‌పై క‌నిపించ లేదు. 

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నంద‌మూరి హీరోల‌ను క‌లిపి సినిమా చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌నే అని చెప్పాలి. ప్ర‌స్తుతం బాల‌య్య‌కు, ఎన్టీఆర్‌, క ళ్యాణ్ రామ్‌తో ఉన్న సంబంధాల నేప‌థ్యంలో కావొచ్చు.. ఈ ముగ్గురిని క‌లిపి సినిమా తీసేందుకు ద‌ర్శ‌కులు, క‌థ సెట్ చేయ‌డం పెద్ద స‌వాల్ లాంటిదే. ఒక వేళ ఈ ముగ్గురు క‌లిసి సినిమా చేయాల‌నుకుంటే క‌థా ప‌రంగా ఇబ్బంది లేక‌పోవ‌చ్చు. బోయ‌పాటి శీను, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి లాంటి వాళ్ల‌కు మాత్ర‌మే ఇప్పుడున్న ప‌రిస్తితుల్లో ఈ ముగ్గురు హీరోల‌ను క‌లిపి సినిమా చేయ‌డం సాధ్యం అవుతుంది.

 

రాజ‌మౌళికి ఇప్పుడున్న కమిట్ మెంట్ల‌ను బ‌ట్టి చూస్తే నంద‌మూరి ఫ్యామిలీల‌ను క‌లిపి ఓ సినిమా తీసే ప‌రిస్థితులు లేవు. అయితే కొర‌టాల శివో లేదా బోయ‌పాటి శీనునో ఓ యాక్ష‌న్‌, ఫ్యామిలీ సెంటిమెంట్ నేప‌థ్యంలో ఏదైనా క‌థ రెడీ చేసుకుంటే ఆ క‌థ ఈ ముగ్గురు నంద‌మూరి హీరోల‌కు సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ముగ్గురు హీరోల‌ను క‌లిపి ప్ర‌యోగాత్మ‌క సినిమా చేసే ఛాన్స్ ఉండ‌దు. అందుకే ఫ్యామిలీ, యాక్ష‌న్ త‌ర‌హా క‌థాంశంతోనే ఈ సినిమా చేయాల్సి ఉంటుంది. మ‌రి ఈ కాంబినేష‌న్ ఎప్ప‌ట‌కి సెట్ అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: