తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మకుటం లేని మహారాజులు అని చెప్పుకోవచ్చు. మాస్ మసాల సినిమాలతో పాటు రొమాంటిక్ మూవీస్ లలో నటించిన పవన్ కళ్యాణ్, చిరంజీవి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఒకవేళ వీరిద్దరూ కలిసి నటిస్తే ఇక ఆ సినిమా ఎంతగా హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీళ్లిద్దరు సినీ కెరీర్ లో ఇటువంటి సినిమా ఒక్కటి కూడా తెరకెక్కలేదు. భారతదేశంలో ఎనలేని పాపులారిటీని సంపాదించుకున్న రాజమౌళి ఒక రొమాంటిక్ చిత్రాన్ని వీరిద్దరి పెట్టి తీస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే సంతోషం కలుగుతుంది.


మగధీర, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ లాంటి అద్భుతమైన లవ్ స్టోరీలను చాలా చక్కగా తెరకెక్కించిన రాజమౌళి మెగా ఫ్యామిలీ లోని ఇద్దరి బడా హీరోల కోసం ఇంకా ఎంత గొప్పటి సినిమాలు తెరకెక్కించగలడో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సరసన తాప్సీ పన్ను, చిరంజీవి సరసన ఎవరైనా కొత్త హీరోయిన్ ని పెట్టి మాంచి పల్లెటూరి ప్రేమ కథలతో సినిమా తీస్తే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.


ఒకవేళ రొమాంటిక్ చిత్రం కాకపోయినా... ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాయకుడు, ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులకు దిమ్మ తిరిగే ఝలక్ ఇవ్వొచ్చు. అడ్వెంచర్ సినిమాలో అయినా మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి నటించవచ్చు. కామిక్ ఫ్యాంటసీ, మర్డర్ మిస్టరీ, సైంటిఫిక్ ఫిక్షన్, డిటెక్టివ్, చివరికి హారర్ సినిమాలలో కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను కనులవిందు చేయవచ్చు. ఏది ఏమైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కేవలం ఒకే ఒక్క సినిమా వచ్చినా మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. మరి భవిష్యత్తులో మెగా అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి: