సినిమాలో కొన్ని కొన్ని కాంబినేష‌న్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. మ‌రికొన్ని ఇదేం కాంబినేష‌న్ రా బాబు అనిపిస్తుంది. అయితే అభిమానులు మాత్రం స్టార్ హీరోలు జ‌త క‌డితే.. ఏ రేంజ్‌లో పండ‌గ చేసుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక్కోసారి మ‌న ఊహ‌కు అంద‌ని కాంబినేష‌న్స్ కూడా సెట్ అవుతూ ఉంటాయి. మ‌రికొన్ని సెట్ అయితే బాగుంటుంది అన్న ఊహాలు కూడా వ‌స్తుంటాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ సెట్ అయితే ఎలా ఉంటుంది..? ఓ సారి ఊహించుకోండి.

 

అగ్రెసివ్ యాటిట్యూడ్, విభిన్నమైన మేనరిజమ్స్ తో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడి యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ పడ్డాయి. వాస్త‌వానికి టాలీవుడ్ లో యువ హీరోలు చాలామందే ఉన్నారు కానీ అతి అతక్కువ సమయంలో యూత్ లో భారీ క్రేజ్ సాధించిన హీరో మాత్రం విజయ్ దేవరకొండ ఒక్కడే. అనాతి కాలంలో రౌడీ హీరోగా యూత్‌లో భారీ క్రేజ్ సంపాధించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపులు చ‌విచూస్తున్నారు. అయిప‌ప్ప‌టికే విజ‌య్ ఫాలోంగ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రి ఇలాంటి అగ్రెసివ్ యాటిట్యూడ్ క‌లిగిన‌ విజ‌య్ దేవ‌ర‌కొండ.. చిరంజీవి కాంబినేష‌న్ వ‌స్తే నెవ‌ర్ బిఫోర్‌.. ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అనే చెప్పాలి. 

 

మరి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది.. విలన్ గా ఎవరు నటిస్తే బాగుంటుంది అనేది చూస్తే... విలన్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌‌ అయితేనే కథ బాగుంటుంది అంటున్నారు అభిమానులు. ఎలాగో విజ‌య్ రౌడీ లుక్‌లో అద‌ర‌గొడ‌తాడ‌నే చెప్పాలి. అందుకే విలన్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ అయితే చిరంజీవి హీరో అయితే బాగుంటుందని భావిస్తున్నారు. లేదా తండ్రికొడుకులు అయినా బాగుంటుంద‌నే చెప్పాలి. ఏమైనా ఈ కాంబినేష‌న్‌లో సినిమా చేసే డైరెక్ట‌ర్ మాత్రం నిజంగా అదృష్ట‌వంతుడు అవుతాడ‌ని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఇలాంటి రేర్ కాంబినేష‌న్‌లో సినిమా రావ‌డం చాలా అరుదు.  మ‌రి ఎప్ప‌టికైనా ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుందో.. లేదో.. చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: