మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది . కేవలం హీరోగానే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక పెద్దన్న లా  ప్రస్తుతం చిరంజీవి కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే దాని పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. అయితే ఇప్పటికే చిరంజీవి కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్న విషయం తెలిసిందే. భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాలతో పాటు ఎన్నో మైలురాళ్లుగా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే దాదాపు అందరు  దర్శకులతో సినిమాలు తీశాడు చిరంజీవి. 

 

 

 ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అందరూ ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఏది అంటే అది చిరంజీవి రాజమౌళి కాంబినేషన్. ఒకానొక సమయంలో రాజమౌళి కూడా చిరంజీవి గారి తో సినిమా తీయాలని ఉంది.. ఎప్పుడో ఓసారి పక్క సినిమా తీస్తాను అంటూ వ్యాఖ్యానించడం కూడా మెగా అభిమానుల్లో కొత్త కోరికను రగిలించింది.అయితే మెగాస్టార్ కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ రాజమౌళితో కాంబినేషన్ లో సినిమాలో నటిస్తే మాత్రం మెగాస్టార్ కెరీర్లోనే ది బెస్ట్ హిట్గా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన రాజమౌళి క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే. 

 

 

 దీంతో రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది. ఇక అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. మరి మెగాస్టార్ సినిమా తీయాలంటే రాజమౌళి ఎలాంటి స్క్రిప్టు రెడీ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగానే మిగితా దర్శకులందరూ కంటే ఎంతో భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు రాజమౌళి. ఎంతో డిఫరెంట్ స్క్రిప్ట్ రాసుకుని వాటిని తెరకెక్కిస్తు భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ మెగాస్టార్ తో  సినిమా తీయాలనుకుంటే రాజమౌళి ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తాడు అన్నది ఊహకందని విధంగా ఉంటుంది.ఏ  స్క్రిప్ట్ అయినా అది బలంగా ఉంటే తప్ప రాజమౌళి ముందడుగు వేయడు అన్న విషయం తెలిసిందే. మరి చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా మాత్రం మెగా అభిమానులకు ఒక ఊహల ప్రపంచం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: