హేయ్ నిజామా?  నిజంగా తీస్తున్నారా? అని అనుకుంటున్నారు కదా! అవును మీరు అనుకున్నట్టు ఇది నిజం కాదు.. కేవలం 'ఊహ'నే. ఊహే ఇంత బాగుంటే నిజం అయితే ఇంకేంత బాగుంటుందో కదా! అప్పుడు ఎప్పుడో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ బాబు మాటలు చెప్పాడు.. ఆ మాటలకే ఎంతోమంది ఫిదా అయ్యారు అనుకోండి.    

 

అయితే మల్టీ స్టార్ గా ఎన్నో సినిమాలు వచ్చాయి.. మహేష్ బాబు కూడా వెంకటేష్ తో మల్టీ స్టారర్ సినిమా అయినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించగా.. పవన్ కళ్యాణ్ కూడా వెంకటేష్ తో మల్టీ స్టార్ సినిమా తీశాడు.. అదే గోపాల గోపాల. వీళ్ళు ఇద్దరు వెంకటేష్ తో తీశారు కానీ వీళ్ళు ఇద్దరు కలిసి మాత్రం ఓకే సినిమాలో నటించలేదు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అభిమానులు.. పవన్ కళ్యాణ్ అభిమానులు అంత కూడా వీరి ఇద్దరి మల్టీ స్టార్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.. ఏంటి అండి ఇది.. ఇలా అయితే ఎలా ? మీ మల్టీ స్టార్ సినిమా కోసం మేము ఎదురు చూస్తున్నాం కదండీ! ఎవరెవరో.. ఏవేవో మల్టీ స్టార్ చేస్తున్నారు.. మీరు ఎందుకు చెయ్యరు అని ఫ్యాన్స్ బాధ పడిపోతున్నారు అంటే నమ్మండి. 

 

అయినా.. పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు సినిమా.. ఆ ఊహ ఎంత బాగుంది అండి.. దేవుడు కరుణిస్తే.. మంచి కథ దొరికి.. మంచి దర్శకుడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతే అద్భుతం.. అమోగం.. అబ్బో చెప్పకూడదు లెండి.. అంత బాగుంటుంది సినిమా.. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.                        

మరింత సమాచారం తెలుసుకోండి: