ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల‌కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వాస్త‌వానికి టాప్ యంగ్ హీరోస్ సినిమాలు వస్తున్నాయంటే అభిమానులకు పండగే. ఇక అలాంటి అభిమాన హీరోలు కలిసి నటిస్తుంటే... ఇక ఆ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.  బడా స్టార్ హీరోలందరు కూడా వేరే హీరోలతో కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అంతేకాదు స్టోరీ డిమాండ్ చేస్తే.. ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనకాడటం లేదు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ సినిమాల జోరు మళ్ళీ పెరిగిందని చెప్పవచ్చు.

 

అయితే ఒక్కోసారి ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు కాంబోలో సినిమా వ‌స్తే భ‌లే బాగుంటుంది క‌దా అని అనుకునేవాళ్లు చాలా మందే ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రియు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తే ఎలా ఉంటుంది..? అనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ, ఈ కాంబో అస‌లు సెట్ అవుతుందా అనుకునేవాళ్లు అంత‌కు మించి ఉన్నారు. ఎందుకంటే.. ఈ సంక్రాంతికి వీరి మ‌ధ్య జ‌రిగిన పోటీనే కార‌ణం అంటున్నారు. 

 

'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా మహేష్ బాబు రంగంలోకి దిగగా.. 'అల.. వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్ సంక్రాంతి సమరంలో దూకారు. అయితే ఎందుకో తెలియదు కానీ సంక్రాంతి నుంచి మహేష్, బన్నీ మధ్య చాలా పెద్ద సమరమే జరిగింది. థియేటర్స్ నుంచి కలెక్షన్స్ వరకు అన్నింట్లోనూ పోటీ పడుతూ వచ్చారు. చివరికి డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై కూడా ఒకరికొకరు పోటీ పడ్డారు. ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయారు. దీంతో టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. మ‌రి అలాంటి ఈ స్టార్ హీరోల కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తే.. అది ఖచ్చితంగా ర‌చ్చ ర‌చ్చే అవుతుంది. మ‌రి వీరి కాంబోలో సినిమా వ‌స్తుందో.. లేదో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: