సినిమాకు హీరో, హీరోయిన్ల పెయిర్ చాలా ముఖ్యం. వాళ్ల కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎంత బాగా వర్కౌట్ అయితే ప్రేక్షకులకు అంత కనువిందుగా ఉంటుంది. సినిమా ఫలితానికి భిన్నంగా హీరో, హీరోయిన్ల పెయిర్ కు పేరొస్తుంది. తర్వాతి సినిమాల్లో ఇదే కాంబినేషన్ రిపీట్ కావాలని ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు భావిస్తారు. ప్రస్తుత జనరేషన్ లో స్టార్ హీరోల్లో రామ్ చరణ్ కు ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. హీరోయిన్లలో సాయి పల్లవికి కూడా మంచి స్టేటస్ ఉంది.

 

 

హీరోగా రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ బేస్, క్రేజ్ ఉంది. డ్యాన్సుల్లో మంచి గ్రేస్ ఉంది. టాలీవుడ్ లో ఉన్న డ్యాన్సర్లలో రామ్ చరణ్ కు స్పెషల్ ప్లేస్ ఉంది. దీంతో రామ్ చరణ్ చేసే ప్రతి సినిమాలో జోడీగా నటించే హీరోయిన్ పై ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. హీరోయిన్లలో సాయి పల్లవికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. చలాకీ నటన, ఆకట్టుకునే అందం కూడా ఆమె సొంతం. పైగా డ్యాన్సుల్లో సాయి పల్లవి చూపించే స్పీడ్, గ్రేస్ కు కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ జోడీగా మంచి డ్యాన్స్ బేస్ సినిమా పడితే మంచి హిట్ సినిమా అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం.

 

 

సోషల్ మీడియాలో కూడా చరణ్ అభిమానుల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ ఆశలకు హద్దు ఏమీ ఉండదు. వారి ఆశలకు అనుగుణంగా కూడా కొన్ని కథలు సిద్దమవుతూ ఉంటాయి. అలాగే.. ట్రెండ్ కు తగ్గట్టు కూడా కొన్ని సినిమాలు వస్తూంటాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్సాయి పల్లవి స్టార్ స్టేటస్ కు తగ్గట్టు ఓ సినిమా వస్తే ప్రేక్షకులకు మంచి విజువల్ ఫీస్ట్ అవుతుంది. మరి ఈ కాంబో ఎవరు సెట్ చేస్తారో చూడాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: