ఒకప్పుడు పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఎక్కువగా పాడిన పాట ‘వయ్యారి భామ నీ హంస నడకా.. ఎందుకే తొందర తొందర’ గుర్తుంది కదా.. ఈ పాట కంపోజ్ చేసి పాడిన సింగర్ రమణ గోగుల అప్పట్లో బుల్లితెర, వెండితెరపై ఓ ట్రెండ్ సృష్టించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తో తమ్ముడు, బద్రి, జానీ వంటి సినిమాలకు హిట్ సంగీతం అందించిన వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల చాన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చారు.  ప్రస్తుతం టాలీవుడ్ యువ సంగీత దర్శకులు వస్తున్నారు.. దాంతో రమణ గోగుల సినీ పరిశ్రమకు దూరమయ్యారు.  ఆయన బుల్లలితెరపై ఆ మద్య జడ్జీగా కనిపించినా.. మళ్లీ కనుమరుగయ్యారు.

 

చాన్నాళ్ల కిందట టాలీవుడ్ నుంచి తప్పుకున్న రమణ గోగుల తాజాగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "డియర్ పవన్ కల్యాణ్, జానీ సినిమా కోసం మనం మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించి 17 ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నాను. ఏదో నిన్నో,మొన్నో కలిసినట్టుంది. జానీ తర్వాత మన ప్రస్థానం ఘనంగా సాగిందనే అనుకుంటున్నాను. జానీ రిలీజ్ డే సందర్భంగా శుభాభినందనలు" అంటూ రమణ గోగుల భావోద్వేగభరితంగా స్పందించారు. అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడరు రమణ గోగుల.. ఫోక్ సాంగ్స్ కి వెస్టన్ మ్యూజిక్ టచ్ చేస్తూ దుమ్ముదుళిపారు.

 

ఒకదశలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా చెలామణి అయ్యారు.  ఆయన తెలుగులో చివరిగా సంగీతం అందించిన చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. 2013 తర్వాత రమణ గోగుల చిత్రపరిశ్రమకు గుడ్ బై చెప్పారు. ఖరగ్ పూర్ ఐఐటీ నుంచి ఎంటెక్, లూసియానా స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) చేసిన రమణ గోగుల ప్రస్తుతం తన సంస్థల కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కరోనాపై కొత్త పాటలు ట్యూన్ చేస్తున్నారు.. మరి రమణ గోగుల ఏదైనా ప్లాన్ చేస్తున్నారో లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: