తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందామా మరి... వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ ఏ సినిమాలు తీస్తున్నారు ఏ సినిమాలు తీయబోతున్నాడు ఈ విషయంపై కాదండోయ్.. సాధారణంగా మెగా ముచ్చట్ల కోసం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అసలు మెగాస్టార్ తో సినిమా ప్రస్తావనే లేకుండా ఇంటర్వ్యూ జరిగిందనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే... మొదటగా బాగున్నారా అని బాగోగులు అడగరు.

ఇంటర్వ్యూ : గత కొన్ని రోజులుగా మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా, కార్మికులకు CCC ద్వారా సహాయాలు... కొన్ని రోజులు ముందుకు వెళ్తే అర్జున్ సురవరం, ఒక పిట్ట కథ సినిమా ఫంక్షన్లకు హాజరు మనం చూస్తూ ఉంటే...

చిరు: అయ్యుండొచ్చు అండి.. మనలో కూడా మార్పు వస్తుంది కదా. అలాగే మన దృక్కోణం కానీ ఆలోచనలు కానీ పెరుగుతూ వస్తూ ఉంటాయి కదా. అందుకేనేమో మీకు అలా అనిపించింది ఏమో..

ఇంటర్వ్యూ : కరోనా  సమయాన్ని ఎలా గడుపుతున్నారు సార్.. ?

చిరు : ఈ సరైన సమయంలో నేను పూర్తిగా ఇంటికే అంకితం అయిపోయాను. ఇంటి నుంచి బయటకు వెళ్లి నెల రోజులు పైగా అయిపోయింది. ఈ సమయంలో ఒకసారి మాత్రం పిల్లలు, మనవరాలు ఇంటికి వచ్చారు. అలాగే సోషల్ డిస్టెన్స్ ను మెయింటెయిన్ చేస్తూనే వచ్చి వెళ్లిపోయారు వారు.

ఇంటర్వ్యూ: మనవరాళ్లతో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారా ..? 

చిరు: అవును తప్పనిసారిగా అయిపోయింది కదా అండి. వాస్తవానికి మనవరాళ్లని చూడగానే దగ్గరకు తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఏం చేద్దాం కరోనా కారణంగా ఎవరికి వారు డిస్టెన్స్ మైంటైన్ చేయాలన్నా సలహాలు గుర్తుకు వచ్చి... ఇష్టాన్ని, అభిమానాన్ని ఆపుకున్నాను చిరు తెలిపాడు. అప్పుడు కూతురు నాన్న మీరు మేము ఒక నెల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. పిల్లలకు ఏమి కాదు మీరు వేరే డోంట్ వర్రీ అని కూతురు అనగా అప్పుడు మనవరాలు దగ్గరకు తీసుకొని గుండెలకి హత్తుకున్నాను అంటూ చిరు తెలిపాడు. 

ఇంటర్వ్యూ: ఇటీవల నేచర్ ను ఒక వీడియో చేశారు...!

చిరు: అవునండి అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. 


ఇంటర్వ్యూ: ఇతర సోషల్ మీడియా లో మీ వీడియోలు చూస్తూ ఉంటే..మీ కొత్త ఇల్లు ఎప్పుడు చూస్తామా అనిపిస్తోంది.

చిరు: రావాలి అండి.. నేను మీ అందరికి మంచి ఆతిథ్యం ఇస్తాను. అలాగే నేను మంచి హోస్ట్ ను కూడా. 13 - 14 సంవత్సరాల వున్న తర్వాత మారుద్దామని అనిపించి, నాలుగేళ్లు వేరే ఇంట్లో వుండి చేయించాం.

మరింత సమాచారం తెలుసుకోండి: