ప్రపంచ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సినీ రాజకీయ ప్రముఖులు సూచించారు..

 

 

 


కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 

 

కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

ఈ నేపథ్యంలో సినీ తారలు ఇళ్లలో ఉంటూ లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో అనే విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, డైరెక్టర్ రవి బాబు ఓ ఫన్నీ వీడియోను అభిమానలతో పంచుకున్నారు. ఆ వీడియోలో రవిబాబు ఏడుస్తూ బర్త్ డే జరుపునంటూ కనిపించాడు. పక్కనే  సీనియర్ నటుడు చలపతి రావు కూడా ఉన్నారు. ఇంకో విషయమేంటంటే రవి బాబు కట్ చేసిన కేక్ కూడా కరోనా ఆకారంలో ఉంది. మొత్తానికి ఫన్నీగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: