టాలీవుడ్ లో స్వయంకృషితో పైకి వచ్చిన గొప్పనటులు మెగాస్టార్ చిరంజీవి. చిన్న పాత్రల్లో నటించి.. విలన్ గా మెప్పించి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను ఎలిన గొప్ప నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాతి స్థానం దక్కించుకున్నారు. సినీ ప్రపంచానికి డ్యాన్స్, ఫైట్స్ లో కొత్త వొరవడి తీసుకు వచ్చారు. మెగాస్టార్ అంటే సామాన్య జనాలకే కాదు.. సినీ సెలబ్రెటీలకు కూడా ఎంతో ఇష్టం.  ఆయన్నిఆదర్శంగా తీసుకొని ఎంతో మంది నటులు డ్యాన్స్ నేర్చుకున్నారు.  తనకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరంటే వెంటనే చిరంజీవి అని చెప్పేవారు కోట్ల మంది అభిమానులు ఉన్నారు.  పదేళ్ల విరామం తర్వాత వివివినాయకర్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు.  

 

ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి  లో నటించారు... కానీ ఇది పెద్దగా ఆకర్షించలేకపోయింది.  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది.  ఇక పవన్ కళన్యాన్ నటించిన ‘ఖుషి’ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన అజయ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ లో టిట్లా లాంటి భయంకరమైన విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాను. నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

 

నా కెరియర్ కి ఈ పాత్ర చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలమైనా సెట్లో చిరంజీవిగారిని కలుసుకున్నప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నారు.. ఎంత గొప్ప నటులైనా ఆయన నిగర్వి.. చాలా శాంతంగా ఉంటారని అన్నారు.  నన్ను ఆయన చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సినిమాల గురించి ఆయన మాట్లాడుతుంటే, గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది  అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: