టాలీవుడ్ లో ఒక సినిమా వస్తుంది అంటే చాలు కథ గురించి అనేక విధాలుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. మన తెలుగు హీరోలకు ఇమేజ్ ఎక్కువ కాబట్టి సినిమాలు ఇప్పుడు బాగా మార్కెట్ ని కూడా ప[ఎంచుకున్నాయి అనేది వాస్తవం. మన తెలుగు ప్రేక్షకులకు కాస్త ఆశ ఎక్కువగా ఉంటుంది అనే మాట వాస్తవం. మన తెలుగు దర్శకులు కూడా అదే విధంగా అభిమానులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దర్శకులు కూడా ఎక్కువగా అభిమానులకు నచ్చే కాంబినేషన్ ని ఎంచుకోవడం తో పాటుగా కథ లో ఎక్కడా కూడా హీరోని తక్కువ చేసే ప్రయత్నాలను అసలు చేయరు అనేది వాస్తవం. 

 

తమిళ సినిమాల్లో అలా ఉండదు. ఏ హీరో అయినా సరే ఏ పాత్ర అయినా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అభిమానులు కోరుకునేది ఏంటీ అంటే ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి సినిమాలు చెయ్యాలి అని... అలాంటి సినిమా వస్తే చూడాలి అని కోరుతున్నారు. తమిళ హీరోలకు ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే ఎలాంటి పాత్ర అయినా సరే వాళ్ళు చేయడానికి వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం. కాబట్టి మన తెలుగు హీరోలు కూడా అలాగే చెయ్యాలని కోరుతున్నారు. చిన్న చిన్న హీరోలు కూడా అక్కడ ప్రయోగాలు చెయ్యాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. 

 

కాని మన తెలుగులో మాత్రం అలాంటి వాతావరణం చాలా వరకు మనకు కనపడే అవకాశం ఉండదు. కాబట్టి హీరోలను అభిమానులు కోరుతున్నారు. మీ నుంచి మేము ప్రయోగాలను ఊహించుకుంటున్నాం కాబట్టి మీరు అలాంటి సినిమాలను చెయ్యాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ మహేష్ బాబు నుంచే ఇలాంటివి ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి వీళ్ళు నటిస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: