మన తెలుగులో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా హీరో నుంచి కథ వరకు అన్నీ కూడా ప్రేక్షకులకు ఆశగా ఉంటాయి. కథ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే కథ ఏ విధంగా ఉంటుందా అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మన జనాలకు. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలు వస్తున్న తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా కథ ఎలా ఉంటుంది అనే ఆసక్తి చూపిస్తున్నారు. మన తెలుగు హీరోలకు ఇమేజ్ ఎక్కువ కాబట్టి కమర్షియల్ సినిమాలు అయితే కథ ఈ విధంగా ఉండాలి అంటారు. 

 

ప్రస్తుతం మన తెలుగులో అందరు అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయి. ఇక విషయం ఏంటీ అంటే చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలి. ఆ సినిమా లో చిరంజీవి బాలకృష్ణ బావ బామ్మర్ది గా నటించాలి అనేది చాలా మంది ఆశ. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎంతో బాగుంటుంది అని ఎప్పటి నుంచో ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ఇలాంటి ప్రయోగాలు చేయడానికి సిద్దంగా ఉన్నా చిరంజీవి మాత్రం తన ఇమేజ్ ని దాటి ఇలాంటి సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించే అవకాశం ఉండదు 

 

ప్రస్తుతం మన తెలుగులో ఈ ఇద్దరి సినిమాలు వరుసగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల తర్వాత ఈ ఇద్దరు ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత లేకపోయినా బాలకృష్ణ మాత్రం ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించాలని చూస్తున్నారు. ఆ సినిమాలో చిరంజీవి ఉంటే బాగుంటుంది అనేది చాలా మంది అభిమానుల ఆశ. చిరంజీవి బాలకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తే ఈ తరానికి బాగా వెళ్తుంది అంటారు అభిమానులు. మరి ఈ సినిమా వస్తుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: