ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్ తో కుర్ర కారుని ఒక ఊపేస్తూ యూత్ ఐకాన్ గా మారాడు మన బన్ని. కెరీర్ మొదటి నుండి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించాడు. ప్రతి సినిమాలోను వైవిధ్యమైన స్టయిల్ తో ప్రేక్షకులకు  కను విందు చేస్తాడు. మెగా ఫ్యామిలి  నుంచి వచ్చినా తన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో స్టయిలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో అల వైకుంటపురం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బన్ని తరువాత సినిమాకు మంచి ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడని తెలిసింది. దీని గురించి తెలిసిన అందరు బన్ని ముందు చూపుకి ఆశ్చర్య పోతున్నారు. ఇంతకి ఆ ప్లాన్  ఏమిటో మరి.

 

గతంలో హిట్ లు అందించిన దర్సకుల తోనే బన్ని మరొక సారి జత కట్టి మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రానికి పుష్ప అనే టైటిల్ పెట్టారు. ఇందులో బన్ని డిఫరెంట్ మాస్ లుక్ తో మెరవనున్నాడు. దీనికి సంబంధించి పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో రష్మిక మందనా జతకట్టనుంది. అయితే ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రోమాన్స్ ఎవరు ఉహించని విధంగా ఉండబోతుంది అని ప్రచారం జరుగుతుంది. 

 

పాన్ ఇండియా మూవీ గా అయిదు భాషల్లో రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ నివేదా థామస్ కూడా నటిస్తుందని సమాచారం. అయితే నివేదా కు ఒక కీలక పాత్ర ఇచ్చారని, ఆ పాత్ర తో కథ మలుపు తిరుగుతుందని సినీ వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం నివేదా ను అల్లు అర్జున్ సూచించాడని తెలుస్తుంది. ఈ సినిమా పలు భాషల్లో వస్తున్నందున అన్ని బాషలలో పట్టు ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని బన్ని నివేదా ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. నివేదా సౌత్ ఇండియా లోని పలు భాషలలో నటించింది. పలు భాషల్లో పరిచయము  ఉండటమే నివేధాని సెలెక్ట్ చేయడానికి అసలు కారణం.     అల్లు అర్జున్ కి ముందు చూపు ఎక్కువే…!

మరింత సమాచారం తెలుసుకోండి: