టాలీవుడ్ లో చిత్రం సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ తర్వాత మన 'మనసంతా నువ్వే' సినిమాతో లవర్ బాయ్ గా మెప్పించాడు.  ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటనకు ఫిదా అయ్యారు.  ఆ తర్వాత వరుస విజయాలతో తనకంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.  ఎంత గొప్పగా సినీ పరిశ్రమలో ఎదిగాడో  అదే రేంజ్ లో అంతరార్థం అయ్యాడు.  ఒక మంచి హీరో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ సినీ అవకాశాలు రాకపోవడంతో కలత చెంది మానసికంగా కృంగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య ఎంతో మంది కళాకారులు సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందన్న అలోచనలో పడ్డారు. 

 

 ఉదయ్ కిరణ్ లాంటి హీరోకే ఇలాంటి పరిస్థితి అంటే సామాన్య నటుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. తెలుగు తెరపై హిట్ చిత్రాలను ఆవిష్కరించిన దర్శకులలో వీఎన్ ఆదిత్య ఒకరు. 'మనసంతా నువ్వే' .. 'నేనున్నాను' .. 'బాస్' వంటి చిత్రాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలుగా కనిపిస్తాయి. అలాంటి వీఎన్ ఆదిత్య .. ఉదయ్ కిరణ్ హీరోగా 'మనసంతా నువ్వే' వంటి ప్రేమకథా మూవీ తెరకెక్కించారు.  తాజా ఇంటర్వ్యూలో వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావించారు. 

 

ఉదయ్ కిరణ్ ఆ రోజున ఆ తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే, ఇప్పుడు ఇంకా మంచి హీరోగా ఉండేవాడు. ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో మంచి అవకాశం దక్కించుకునేవారు అని అన్నారు. ఫ్యామిలీ స్టోరీస్ కి ఉదయ కిరణ్  బాగా పనికొస్తాడు. ఎమోషన్స్ తో కూడిన డ్రామాను పండించడమెలాగో ఆయనకి తెలుసు. ఆ తరహా కథలను తయారు చేసుకున్న దర్శక నిర్మాతలకు ఉదయ్ కిరణ్ ఇప్పుడు మంచి ఆప్షన్ అయ్యుండేవాడు.  ఇప్పుడు ఆయన స్టేజ్ కి మంచి గుర్తింపు వచ్చి ఉండేది.. కానీ తొందర పడి మంచి ఫ్యూచర్ మిస్ చేసుకున్నాడని బాధపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: