ఉదయ్ కిరణ్. విధి కొట్టిన దెబ్బకు బలి అయిపోయిన అమాయకపు హీరో. ఆయన పద్దెనిమిదేళ్ళకే హీరోగా ఎంటరయ్యాడు. చిత్రం సినిమాతో వెండితెర మీద చిత్రాలు చూపించాడు.  ఉదయ్ అప్పట్లో బ్యాక్ టు  బ్యాక్ సూపర్ హిట్లు ఇచ్చాడు. అది 2000 సంవత్సరం. న్యూ మీలీనియంలో అప్పటి సూపర్ స్టార్లకు ఉదయ్ చుక్కలు చూపించాడు. ఇక తమ పని సరి, యంగ్ బ్లడ్ వచ్చేసింది అనిపించేలా చేశాడు ఉదయ్ కిరణ్.

 

తారా జువ్వలా ఎగిసిన ఉదయ్ కెరీర్ కొన్ని పరిణామాల నేపధ్యంలో మసకబారింది. ఉదయ్ కిరణ్ కి ఓ దశలో వరసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఆయన రెండవ ఇన్నింగ్స్ దారుణంగా సాగింది. దాంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 2014 జనవరి 6న ఉదయ్ కిరణ్ ఉరివేసుకుని చనిపోయాడు. ఇప్పటికి ఆరేళ్ళు అయింది ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వీడి. అయితే ఇప్పటికీ ఉదయ్ ని అభిమానించే వారు కోట్లలో ఉన్నారు.

 

ఆయన సినిమాలు చూస్తూ ఆనందించేవారు ఉన్నారు. అదే విధంగా ఉదయ్ తో సినిమాలు చేసిన దర్శకలకు ఆయన హాట్ ఫేవరేట్ హీరో. అలా ఉదయ్ తో మనసంతా నువ్వే మూవీ తీసిన డైరెక్టర్ వీ ఎన్ ఆదిత్యమీడియా ఇంటర్వ్యూలో ఆసక్తిక్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కనుక ఇపుడు ఉండి ఉంటే మంచి అవకాశాలు వచ్చేవి. ఫ్యామిలీ ఎమోషన్లు ఉదయ్ బాగా పండిస్తాడు. ఆయనకు ఆ తరహా పాత్రలు,కధలు నప్పుతాయి.

 

ఉదయ్ అనుకోకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని ఈ లోకం నుంచి దూరం అయ్యాడని ఆదిత్య బాధపడ్డాదు. నిజమే ఉదయ్ చిన్న వయసులో ఇలా చేశాడు. ఉదయ్ ఉండాల్సిన వాడు. ఆయన లేని లోటు టాలీవుడ్ కి ఎప్పటికీ ఉంది. నిజానికి టాలీవుడ్లో ఇపుడున్న వారసులకు స్పూర్తి కూడా ఆయనే. ఆయన్ని చూసే వీరంతా ముఖానికి రంగు వేసుకున్నారు. ఏది ఏమైనా ఉదయ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడన్న ఆదిత్య అభిప్రాయంతో అంతా ఏకీభవిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: