పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా కథ నుంచి టైటిల్ వరకు ప్రత్యేకమైన క్రేజ్ అనేది ఉంటుంది. మన తెలుగుల్ ఈ స్థాయిలో ఏ హీరోకి కూడా క్రేజ్ అనేది లేదు అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కథలో కొన్ని మార్పులు కారణం సినిమాను కొన్ని రోజులు వాయిదా వేసినా ఆ తర్వాత మళ్ళీ వేగంగా షూటింగ్ ని మొదలుపెట్టారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది. క్రిష్ ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసాడని సమాచారం. కథలో కొన్ని అభ్యంతరాలు నిర్మాత రత్నం చెప్పడం తో అది వాయిదా పడింది అనేది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సినిమాలో కొన్ని మార్పులు చెయ్యాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేసినట్టు వార్థలు వస్తున్నాయి. కథ లో మార్పులకు సంబంధించి దర్శకుడు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

 

ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర టైటిల్ కి సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ ని విరుపాక్ష అని అనుకుంటున్నారు. కాని ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అనేది స్పష్టత లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ గా నటించే అవకాశం ఉందని ఒక వజ్రం దొంగ గా ఆయన నటిస్తాడు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులు మాత్రం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: