టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఏ హీరో కథ ఎలా ఉంటుంది టైటిల్ ఏ విధంగా ఉంటుంది అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో హీరో పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి హీరోని అయినా సరే తనకు నచ్చిన విధంగా చూపించి అది ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైన శైలి. ప్రేక్షకులు కూడా అందుకే ఆయన సినిమా మీద అంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 

ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ కూడా పూర్తి అయింది. టైటిల్ ఏది అయితే బాగుంటుందా అనే దాని మీద తారక్ తో అతను చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమా కథకు సంబంధించి కొన్ని మార్పులను కూడా త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్నాడు అనేది టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న మాట. కొన్ని సీన్స్ విషయంలో తారక్ అభ్యంతరం తెలపడం తో వాటిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడట. 

 

కథలో ఎక్కువగా రాజకీయ కోణం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఆ సీన్స్ ని మార్చాలని తారక్ సూచనలు చేసినట్టు సమాచారం. మన తెలుగులో వీరి సినిమా అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు కథ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా కథకు సంబంధించి నిర్మాతలతో కూడా చర్చించారట త్రివిక్రమ్. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాపారవేత్తగా నటించే అవకాశం ఉందని సమాచారం. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: