టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల హవా కొనసాగుతుంది.   'ఫలక్‌నుమా దాస్‌’ సినిమా దర్శకత్వం వహించి హీరోగా నటించాడు విశ్వక్ సేన్.  ఈ కథ హైదరాబాదు లోని ఫలక్‌నుమా లోని దాస్ (విశ్వక్‌ సేన్‌) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది.  లోకల్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా హీరోగా బాగానే మెప్పించాడు కానీ.. కమర్షియల్ హిట్ మాత్రం సాధించలేకపోయాడు.  అయితే ఈ సినిమాపై నెగిటివ్‌ కామెంట్స్ రావడం.. సోషల్ మీడియాలో మనోడు బూతు పురాణం మొదలు పెట్టడంతో విమర్శల పాలయ్యాడు.  ఇదిలా ఉంటే ఈ మద్య నాని నిర్మాతగా తీసిన ‘హిట్’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  క్రైమ్, థ్రిల్లర్ నేపత్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.  

 

శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాతగా  రుహానీ శర్మ  హీరోయిన్ గా ఈ మూవీ మంచి హిట్ అయ్యింది.  ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ నడుస్తుంది. ఈ లాక్‌డౌన్‌తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి.  ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రక్తదానం చేసి యువతను ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని.. ఉత్సాహం ఉన్నవారు రక్తదానం చేయండి అని పిలుపు ఇచ్చారు.  

 

దాంతో ఆయన బాటలు పలువురు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా ‘హిట్’ చిత్ర హీరో విష్వక్సేన్ మెగాస్టార్ చిరంజీవి పిలుపుతో స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు ఆయన శనివారం రక్తదానం చేశారు. లాక్‌డౌన్‌లో రక్తదాతలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని, వారికి ప్రత్యేక పాస్‌లు కేటాయిస్తారని ఇటీవల చిరంజీవి తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: