యాంక‌ర్ ఆర్టిస్ట్ అనితాచైద‌రికి లైఫ్ స్టార్ట్ అయింది ముందు జెమిని టీవీ ఛానల్ నుంచే. ఈమె చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించింది. అలాగే సీరియ‌ల్స్‌లో కూడా చేసింది. కొన్ని ప్రోగ్రామ్స్‌కి హోస్టింగ్ కూడా చేసేది. అయితే ఈమెకి అక్కినేని నాగార్జున స‌పోర్ట్ కాస్త ఎక్కువ‌ని సినీ వ‌ర్గాల్లో  చెబుతుంటారు. కాక‌పోతే స్క్రీన్ మీద మాత్రం చాలా త‌క్కువ కాలం స‌ర్వే అయింది. పెళ్ళ‌య్యాక ఇంట్లో ఉన్న ఆబ్లికేష‌న్స్‌తో పెద్ద‌గా ప్రోగ్రామ్స్‌లో క‌నిపించ‌లేదు. కాక‌పోతే ఈ రోజుకి బ్యాకింగ్‌లో ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనే ఉంది. ఇక ఇంట్లో ఇష్టం లేనందువ‌ల్ల కాస్త ప్రోగ్రామ్స్‌లో పాల్గొన‌డం త‌గ్గించింది.  ఇక ఆమె ఉన్నంత కాలం మాత్రం ఇండ‌స్ట్రీలో మంచి పేరుని సంపాదించింది. రెమ్యూన‌రేష‌న్ ప‌రంగాకాని పేరు అయినా మంచి పేరు తెచ్చుకుంది.

 

అలాగే అనితాచౌద‌రి ఎప్పుడూ త‌న కెరియ‌ర్‌లో ప్రోగ్రామ్స్ కోసం..అవ‌కాశాల కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డింది కూడా లేదు. ఎప్పుడూ అవ‌కాశాల కోసం వాళ్ళ వెపుక వీళ్ళ వెనుక తిర‌గ‌డం లాంటివి కూడా ఆమె కెరియ‌ర్‌లో లేవ‌నే చెప్పాలి. యాంక‌ర్‌గా, ఆర్టిస్ట్‌గా మాత్రం చాలా త‌క్కువ పిరియ‌డ్‌లో చేసింది. ఆ త‌ర్వాత సైడ్ అయిపోయింది. ఇక ఆమె ఇటీవ‌లె ఇచ్చిన  ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి గురించి చెపుతూ ఆయ‌న చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డం అనేది నా అదృస్టం. అది ఎంత పెద్ద పాత్ర అన్న‌ది కాదు ఎంత చిన్న పాత్ర అయినా స‌రే దానికి ప్రాముఖ్య‌త ఉండేలా ఆయ‌న చేస్తారు అంది. ప్ర‌భాస్ న‌టించిన ఛ‌త్ర‌ప‌తి చిత్రంలో ఒక చిన్న బాబుకి త‌ల్లి పాత్ర‌లో ఓ అంధురాలిగా న‌టిస్తుంది. సూరీడు అనే ఆ డైలాగ్ ఇప్ప‌టికీ ఫుల్ క్రేజ్ ఉంద‌ని చెప్పాలి. మొద‌ట్లో నేను ఆ పాత్ర‌ని చేయ‌నన్నాను చాలా అప్‌సెట్ అయ్యాను. అంధురాలి పాత్ర అంటే అంత ఈజీకాద‌ని అన్నాను. కానీ రాజ‌మౌళిగారు నేను చెయిస్తా మీతో ఆ పాత్ర‌ని నో ప్రాబ్ల‌మ్ అని చేయించారు అని అంది.

మరింత సమాచారం తెలుసుకోండి: