దర్శక ధీరుడు రాజమౌళి ఏది చేసినా పక్కా ప్రణాళికతో చేస్తాడన్నది నిజం. ఆయన సినిమా తీయడానికి కూడా ముందు పెద్ద కసరత్తు చేస్తాడు. ఇక తీయడానికి మినిమం రెండేళ్ళ నుంచి మాగ్జిమం మూడేళ్ళు తీసుకుంటాడు. ఆ సినిమా ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. సూపర్ డూపర్ హిట్లతో పది కాలాలు చెప్పుకునేలా ఉంటాయి.

 

ఇదిలా ఉండగా రాజమౌళి ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు అవుతోంది. డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టి ఇరవయ్యేళ్ళు అవుతోంది. ఇక తీసినవి పట్టుమని పది సినిమాలు అయినా కూడా చరిత్ర స్రుష్టించాడు.  బాహుబలి, బాహుబలి టూ సినిమాలు చాలు రాజమౌళి దర్శక ధీరుడు ఎలా అయ్యాడో చెప్పడానికి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజమౌళి భవిష్యత్తు ఆలోచనలు కూడా చేస్తున్నాడుట. అంటే ఆయనరిటైర్మెంట్ గురించి.

 

ఇక మరో పదేళ్ళు మాత్రమే సినీ పరిశ్రమలో గట్టిగా  డైరెక్టర్ గా పనిచేయాలని, ఆ తరువాత రిటైర్ కావాలని రాజమౌళి గోల్ సెట్ చేస్తున్నాడు. రిటైర్ అయిన తరువాత కూడా ఆయన కుటుంబం నల్గొండ జిల్లా ఈదులూరు గ్రామంలో సెటిల్ కావాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడుట. ఇక్కడే రాజమౌళి, ఆయన సోదరుడు కీరవాణి పొలాలు కొనుక్కున్నారు. ఈ పొలాల వద్దనే శేష జీవితం గడపాలని రాజమౌళి పక్కా ప్లాన్ వేసుకున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే రాజమౌళి రిటైర్మెంట్ అన్న వార్తే ఇపుడు ఫ్యాన్స్ కి కంగారు పుట్టిస్తోంది. ఇంకా రాజమౌళి ఎన్నో సినిమాలు తీయాలి. టాలీవుడ్ కీర్తిపతాకన్ని అంతర్జాతీయంగా నిలబెట్టాలి. పదేళ్ళలో రిటైర్ అవుతానని రాజమౌళి చెబుతూంటే కనీసం మూడు నాలుగు సినిమాలు మాత్రమే తీయగలరని కూడా లెక్కలేసుకుంటున్నారు. మొత్తానికి రాజమౌళి రిటైర్ కాకుండా ఓపిక ఉన్నంతవరకూ సినిమాలు తీయాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంలో కె రాఘవేంద్రరావుని ఆదర్శంగా తీసుకోమంటున్నారు. చూడాలి మరి 

మరింత సమాచారం తెలుసుకోండి: