ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎంత దారుణంగా పడిందో ప్రత్యక్ష్యంగా చూస్తూనే ఉన్నాము. లక్షల్లో మరణాలు, వేలకోట్ల ఆర్ధిక సమస్యలు ... సామాన్యుడి దగ్గర నుంచి కోట్లకి అధిపతి అయిన వాళ్ళ వరకు ఊహించనంతగా ప్రభావం చూపించింది ఈ కరోనా మహమ్మారి. ఈ నేపథ్యంలో సౌత్, నార్త్ .. తో పాటు హాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా అగాధం లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్స్ మీద కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. అలాంటి వాళ్ళలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముందు ఉండటం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. 

 

నిర్మాత దిల్ రాజు కి గత కొంతకాలంగా సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ వెనకాలే వరుసగా రెండు మూడు సినిమాలు భారీ డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. అంతేకాదు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు అంతే దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. నిర్మాతగా చిన్న సినిమాలు తీసిన కూడా దిల్ రాజు కి నిరాశే మిగిలుతుంది. కోలీవుడ్ సినిమాని రీమేక్ చేస్తే కనీసం సమంత కోసం థియోటర్స్ కి వచ్చినవాళ్ళు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ ని భారీగా నిర్మిస్తున్నారు. 

 

ఈ సినిమాతో పాటు దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీ హక్కులు భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారన్న కారణంతో దిల్ రాజు అందరితో పోటీ పడీ నైజాం పంపిణీ హక్కులు సొంతం చేసుకున్నారు. అయితే కరోనా చూపించిన తీవ్ర ప్రభావంతో ఇప్పుడు మొత్తం మార్కెట్ కుదేలైంది. 

 

ఈ నేపథ్యంలో దిల్ రాజు పరిస్థితి ఏంటన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోందట. ఒక వైపు నాని నటించిన వి సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. వకీల్ సాబ్ కూడా రిలీజ్ చేయాలి. వీటితో పాటు మరికొన్ని డిస్ట్రిబ్యూట్ చేఅయలన్న ప్లాన్ ఉన్నాయి. కాని ఇప్పుడు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు రెండు రకాలుగా ఇరుకున పడ్డాడని అంటున్నారు. ఈ ఎఫెక్ట్ అందరి కంటే ఎక్కువగా దిల్ రాజుకే ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: