నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లోనే హీరో కాదు. నిజ జీవితంలో కూడా హీరో అని నిరూపించుకుంటూ ఉంటారు. ఏదైనా విపత్తు సంభవించిన సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ఆపత్కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి 50లక్షలు విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం చిరంజీవి స్థాపించిన సీసీసీకి 25లక్షలు ఇచ్చి తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన దాణగుణాన్ని చాటుకున్నారు.

 

 

నందమూరి కుటుంబానికి చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న దివ్యాంగులకు, పారా మెడికల్ సిబ్బందికి బాలకృష్ణ నిత్యవసరాలు అందించి ఆదుకున్నారు. ఈ ఆపత్కాలంలో ఇబ్బందులు పడుతున్న హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ సిబ్బందికి ఈ సాయం ఎంతో ఉపయోగపడనుంది. హాస్పిటల్‌లో పనిచేస్తున్న సిబ్బంది సేవలను ప్రోత్సహించేందుకు, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇలా నిత్యావసరాలు అందిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు బాలకృష్ణ ఆసుపత్రి సిబ్బందికి సాయం చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

 

బాలకృష్ణ చేస్తున్న సాయంపై నెటిజన్లు, బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బసవతారకం ఆసుపత్రిలో ఎందరో పేదలకు బాలయ్య ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తూ ఉంటారు.  గతంలో కూడా ఇటువంటి సమయాల్లో బాలకృష్ణ తన ఉదారతను చాటుకున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఎందరో అసంఘటిత కార్మికులు పనుల్లేక ఉపాధి కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్ధతుల్లో సాయం అందిస్తున్నాయి. దాతలు కూడా ముందుకొచ్చి ఉపాధి కోల్పోయిన ప్రజలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. మరికొంతమంది అన్నదానాలు చేస్తున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: