ప్రస్తుతం యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం వస్తున్న సినిమా కావడంతో దీనిపై అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాతో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పిరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాత కాగా, ఒక అద్భుతమైన స్టోరీతో దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

IHG

ఇకపోతే ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ దర్శకుడైన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నారు. మొత్తంగా ఈ మూడింటి అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాని ప్రారంభించనున్న త్రివిక్రమ్, దాని అనంతరం పవన్ తోనే పని చేస్తారని వినికిడి. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తన చిరకాల మిత్రుడైన రమణ గోగులను తీసుకోవాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లు టాక్. 

 

రమణ గోగుల తో కలిసి తాను పనిచేసిన జానీ చిత్రం నిన్నటితో సక్సెస్ఫుల్ గా 17 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో, రమణ గోగుల తో నిన్న కాసేపు ఫోన్లో ముచ్చటించిన పవన్, త్రివిక్రమ్ సినిమా విషయమై మాటల సందర్భంలో చెప్పారని, అవకాశం ఉంటే ఆ సినిమాకు పని చేద్దాం అని కూడా రమణ తో పవన్ చెప్పినట్లు టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: