సుమ కనకాల, ఈ పేరు ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు అనే చెప్పాలి. ముందుగా కొన్నేళ్ల క్రితం బుల్లితెరపై అక్కడక్కడా కొన్ని నాటికల్లో నటించిన సుమ కనకాల, ఆ తర్వాత కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక అక్కడి నుండి మెల్లగా బుల్లితెరపై ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన సుమ, మెల్లగా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి పేరు దక్కించుకుంటూ యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. స్వతహాగా మలయాళీ అయిన సుమ మన తెలుగు భాష పట్ల ఎంతో గౌరవంతో భాష బాగా నేర్చుకోవడంతో పాటు తనకంటూ యాంకర్ గా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. 

 

ఆ విధంగా మెల్లగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుమ, నేడు తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గల యాంకర్ గా ముందుకు సాగుతున్నారు. అయితే కేవలం టెలివిజన్ షోలు ప్రత్యేకమైన ప్రోగ్రాములు మాత్రమే కాకుండా ఏవైనా పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వంటి వాటికి యాంకర్ గా సుమ ఉండవలసిందే. బుల్లితెర నటుల దగ్గర్నుంచి వెండితెర నటుల వరకూ దాదాపుగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్న సుమ, తనతో పాటు యాంకర్లుగా ప్రవేశించిన ఝాన్సీ, అనితా చౌదరి, ఉదయభాను తదితరులను ఒకింత తన టాలెంట్ తో వెనక్కినెట్టి అందరికంటే ముందు స్థానంలో అగ్రభాగాన నిలిచారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

 

మొదట్లో కొన్ని కార్యక్రమాల్లో యాంకర్ గా పాల్గొన్నప్పుడు కొద్దిపాటి భయం ఉండేదని అయితే రాను రాను మెల్లగా వాటికి అలవాటు పడుతూ తనని తాను విశ్లేషణ చేసుకుంటూ ముందుకు నడిచానని సుమ తరుచూ చెబుతుంటారు. ఇక నటుడు రాజీవ్ కనకాల ను వివాహం చేసుకున్న తర్వాత తన అత్తమామలు అయిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల నుండి ఎంతో నేర్చుకున్నానని అటువంటి భర్త, ఇటువంటి అత్తమామలు కలిగి ఉన్న తాను ఎంతో గొప్ప అదృష్టవంతురాలినని సుమ తరచూ చెబుతుంటారు. ఇక తనకు ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడానికి ఇంట్లో వారి సహకారం, అలాగే ప్రేక్షకుల అభిమానమే కారణమని, తనకు అవకాశం ఉన్నంత వరకు అలాగే ఆరోగ్య సహకరించేంత వరకు యాంకర్ గానే కొనసాగుతానని సుమ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: