ప్రస్తుతం పలు టెలివిజన్ షోలు కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి పేరు తో దూసుకుపోతున్న యువ భామ మంజూష. మొదట్లో అక్కడక్కడా చిన్న చిన్న కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మంజూష మెల్లగా తన ఆకట్టుకునే యాంకరింగ్ టాలెంట్ తో మంచి పేరు సంపాదించడం జరిగింది. ముఖ్యంగా ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే చాలా కార్యక్రమాల్లో తనదైన ఆకట్టుకునే టాలెంట్ తో పేరు దక్కించుకున్న మంజూష, అక్కడక్కడ కొన్ని మూవీ ఆడియో ఫంక్షన్ కి అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి మంచి పేరు దక్కించుకోవడం జరిగింది. ఇక ఏదైనా సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు వంటివి ఉంటే ఎక్కువగా అటువంటి వాటికి మంజూష అయితే బాగా హ్యాండిల్ చేయగలరని కొన్ని టెలివిజన్ ఛానల్స్, న్యూస్ చానల్స్ వారు అంటుంటారట. 

 

ఆ విధంగా తన అందం అభినయంతో మంచి పేరు గుర్తింపు సంపాదించిన మంజూష ప్రస్తుతం బుల్లితెర పై కొనసాగుతున్న టాప్ యాంకర్లలో ఒకరుగా నిలిచారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరోవైపు అనసూయ, రష్మీ వంటి యువ యాంకర్లు తనకు పోటీగా నిలుస్తున్నప్పటికి తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మంజూష అక్కడక్కడా కొన్ని కార్యక్రమాల్లో ఎంతో చాలకీగా వ్యవహరిస్తూ మెల్లగా తన ఇమేజ్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

 

మొదట్లో యాంకర్ గా రాణించటం కొంత భయం గా అనిపించేదని, కొన్ని అయితే రాను రాను మెల్లగా తనను తాను సొంతగా సాధన చేసుకుని ముందుకు సాగానని, అలానే తన ఇంట్లో వారు సపోర్టు తనకు ఎప్పుడూ ఉండటం వల్లనే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని మంజూష తరచూ చెబుతుంటారు. ఇక కోనేల్ల్లర్ క్రితం జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఆయన చెల్లెలిగా నటించిన మంజూష, ఆ పాత్ర ద్వారా మంచి పేరు గడించారు. ఇప్పటికీ ఈ టీవీ కి సంబంధించిన పలు ఛానల్స్ లో చాలా కార్యక్రమాల్లో మనకు దర్శనమిచ్చే మంజూష, యువతలో విశేషమైన పేరు సంపాదించి కొనసాగుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: