ఇప్పుడంటే వెనుకపడ్డది కానీ ఒకప్పుడు జెమిని టివిలో ప్రతి షో సూపర్ హిట్ అయ్యేది. కొత్త కాన్సెప్టులతో షోలు చేస్తూ స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను బాగా అలరించేవారు. మా టివి, జీ తెలుగు రాకముందు ఈటివి, జెమినిలా మధ్యే మంచి పోటీ ఉండేది.. ఈటివి టాక్ షోలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు కనుక అప్పట్లో జెమిని టివినే అందరు చూసేవారు. ఆడియెన్స్ రెస్పాన్స్ ను బట్టి జెమిని టివిలో కొత్త కొత్త షోలు చేసేవారు. జెమిని టివిలో సూపర్ హిట్ అయిన మరో క్రేజీ షో డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఆ షోతో యాంకర్ గా పరిచయమైన జాహ్నవి కూడా చాలా పాపులర్ అయ్యింది. 

 

ఆదిత్య మ్యూజిక్ అదేనండి ఇప్పటి జెమిని మ్యూజిక్ లో యాంకర్ గా చేస్తూనే మరో పక్క డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లో యాంకర్ గా జాహ్నవి అలరించింది. ఆమె క్యూట్ యాంకరింగ్ కు చాలామంది ఫ్యాన్స్ గా ఏర్పడ్డారు. ఆ క్రేజ్ తోనే జాహ్నవి సినిమాల్లో కూడా నటించింది. గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం రణం సినిమాల్లో ఆమె నటన అందరిని మెప్పించింది. అయితే సినిమాల మీద ఫోకస్ పెట్టే ఆలోచనతో బుల్లితెరను వదిలేసిన ఈ అమ్మడు అక్కడ ఇక్కడ ఛాన్సులు లేకుండా చేసుకుంది. 

 

ఫేడవుట్ తర్వాత మళ్ళీ తెరా మీద కనిపించని యాంకర్ జాహ్నవి రీ ఎంట్రీ ఇస్తే చూసేందుకు ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సినిమాల కన్నా బుల్లితెర మీదనే దృష్టి పెడితే ఆమెకు మంచి ఫ్యూచర్ ఉండేది. యాంకర్ గా చేసే ప్రతి అమ్మాయి హీరోయిన్ అవ్వాలనే కలలు కంటారు కానీ అవి జరగాలంటే చాల కష్టపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా యాంకర్ జాహ్నవి అప్పటి ఆడియెన్స్ ను తన వల్లో వేసుకుంది చెప్పొచ్చు. ఆమె షో అంటే యూత్ లో భీభత్సమైన క్రేజ్ ఉండేది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: