టాలీవుడ్ లో సుమా ముందు సుమా తర్వాత అనే విధంగా యాంకరింగ్ లో ఆకట్టుకుంది. వరుస షోస్ చేస్తూ ఆమె ఎవరికి అందని ఎత్తులో ఉంది. మన దేశంలో ఏ భాష చూసినా సరే ఈ స్థాయిలో యాంకర్ గా రాణించిన వారు ఎవరూ కూడా లేరు. అందరూ కొన్ని రోజులు ఆకట్టుకుని ఆ తర్వాత దూరం అయిన వాళ్ళే గాని ఎక్కువ కాలం నిలబడి గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ స్థాయిలో సంపాదించుకున్న యాంకర్ ఎవరూ కూడా ఈ మధ్యలో మనకు కనపడిన సందర్భం అనేది ఉండదు. ప్రస్తుతం సుమ  మన దేశంలోనే ఎవరికి అందని ఎత్తులో ఉంది. 

 

అగ్ర హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా సరే సినిమా కార్యక్రమానికి సుమా యాంకరింగ్ చేస్తేనే అందం అనే విధంగా ఆమె ఆకట్టుకుంది, ఎన్టీఆర్ అయినా మహేష్ బాబు అయినా ఎవరు అయినా సరే సుమాను తీసుకోవాల్సిన పరిస్థితి టాలీవుడ్ లో ఉంటుంది అనేది వాస్తవ౦. అయితే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే వద్దని పక్కన పెట్టింది అంటారు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు జనం. కాని ఆమె మాత్రం అసలు సినిమాల్లో చేసే అవకాశం లేదని స్పష్టంగా చెప్పి వాటికి దూరంగా ఉంది అని అంటారు. ఏ అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం అసలు ముందుకు రాలేదు అని అంటారు. 

 

ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే మహేష్ బాబు సినిమాలో హీరోకి అక్కగా నటించాలి అనే ఆఫర్ వచ్చినా సరే తాను చేయను అని స్పష్టంగా చెప్పింది ఆమె. ఆ విధంగా కెరీర్ లో ఆమె దూసుకుపోతుంది. మరి సినిమాలను ఆమె వద్దు అనుకోవడానికి బలమైన కారణం అంటూ ఎం ఉందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: