పవన్ కళ్యాణ్  చాలా గ్యాప్ తీసుకొని రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా మొదలైన కొన్ని రోజులకే నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఆయన ప్లానింగ్‌కు తగ్గట్లే షూటింగ్ ప్రతీ షెడ్యూల్ ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతూ వచ్చింది. అలాంటి టైంలోనే కరోనా మహమ్మారి వచ్చి అడ్డుపడి షూటింగ్ కి బ్రేక్ వేసింది. 

 

లాక్ డౌన్ కారణంగా మేలో అసలు థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రోజుల షూటింగ్ కూడా పెండింగ్ ఉండటంతో ‘వకీల్ సాబ్’ ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా కనిపించడం లేదని.. 'వకీల్ సాబ్' దసరాకు వాయిదా పడ్డట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'వకీల్ సాబ్'ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారని న్యూస్ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమా దసరాకు కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పటిలో తగ్గేలా లేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి రెండు మూడు నెలలు పడుతుంది కనుక సినిమాను సంక్రాంతి రేస్ లో దింపాలని డిసైడ్ అయ్యారట.

 

థియేటర్స్ కూడా డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయి కనుక…సంక్రాంతి లోపు షూటింగ్ మొత్తం చేసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఆ సమయంలో పెద్ద సినిమాలు రంగంలో వుంటే, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. సంక్రాంతి కి రిలీజ్ అంటే అప్పటికి పవన్ సినిమా విడుదల అయి మూడేళ్లు అవుతుంది కనుక ఆ క్రేజ్ కూడా తోడవుతుంది. సో మేకర్స్ కూడా అప్పుడైతే బాగుంటదని అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: