2014లో తమిళనాడు చెందిన లోటస్‌ టీవీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్‌ జెండర్‌కు యాంకర్‌గా తొలి అవకాశం ఇచ్చింది. అంతేకాదు ఆ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ట్రాన్స్‌ జెండర్‌ పద్మిని ప్రకాష్‌ వ్యాఖ్యతగా సాయంత్రం 7 గంటలకు తొలి బులిటెన్‌ను ప్రసారం చేసింది. తమిళ భాషలో ప్రసారమైన ఈ బులిటెన్ అప్పట్లో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ హిజ్రాకు ప్రైమ్‌ టైంలో యాంకర్‌గా అవకాశం ఇవ్వటంపై పద్మిని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

 

పద్మిని చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తన సమస్య కారణంగా కుటుంబ సభ్యులు ఆమెను 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి గెంటేశారు. దిక్కుతోచని ఆమె అప్పట్లో ఆత్మ హత్య చేసుకోవాలనుకుంది. కానీ కొంత మంది ఆ ప్రయత్నంలో ఆమెను కాపాడారు. ఇంటి నుంచి వచ్చేసిన తరువాత చాలా ప్రాంతాలు తిరిగింది. చిన్న చిన్న పనులు చేస్తూ ఓపెన్‌ డిగ్రీలో జాయిన్‌ అయ్యింది. కానీ ఆర్థిక సమస్యల కారణ్గా మధ్యలో చదువు ఆపేసింది.

 

భరతనాట్యం నేర్చుకుంది ట్రాన్స్‌ జెండర్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచింది. తరువాత పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది పద్మిని. అదే సమయంలో లోటస్ టీవీ ఓ ట్రాన్స్‌ జెండర్‌ను వ్యాఖ్యతగా తీసుకోవాలని భావించినప్పుడు వారు పద్మిని అయితే కరెక్ట్ అని భావించారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ల పట్ల ఉన్న వివక్షణు దూరం చేసేందుక పద్మిని ఇదే సరైన అవకాశం అని భావించింది. రెండు నెలల పాటు వాయిస్ మాడ్యూలేషన్‌లో ట్రైనింగ్‌ తరువా యాంకర్‌గా తెర మీదకు వచ్చింది. పద్మిని బులిటెన్‌ ఆర్థికంగా కూడా చానల్‌కు ప్లస్ అయ్యింది. ఒక్కసారి చానల్ టీఆర్పీ తారా స్థాయికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: