బుల్లితెరపై ప్రస్తుతం చాలామంది యాంకర్లు తమ హవా నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాగా క్రేజ్ సంపాదించిన యాంకర్ జోడి ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది యాంకర్ రవి శ్రీముఖి జోడి. అదేంటో గాని  యాంకర్ రవితో ఎవరు జోడిగా యాంకరింగ్ చేసిన వారికి బాగా పాపులారిటీ వచ్చేస్తోంది. గతంలో రవి  లాస్య  అంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పటాస్ ప్రోగ్రాం లో శ్రీముఖి యాంకర్ రవి కలిసి ప్రోగ్రాం చేయడంతో రవి శ్రీముఖి జోడి ఎంతగానో పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఎక్కడ చూసినా ఈ జోడీనే  కనిపించింది. ఎన్నో ప్రోగ్రాములు.. మరెన్నో ఈవెంట్లు చేసుకుంటూ ఈ  జోడి బుల్లితెరపై మరింత క్రేజ్ సంపాదించింది అనే చెప్పాలి. 

 

 

 అయితే పటాస్ ద్వారా వీరిద్దరి జోడి బాగా పాపులారిటీ సంపాదించింది. పటాస్ లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే పటాస్ లో వీరిద్దరు ఎంతో క్లోజ్గా మూవ్ అవుతుండటంతో ప్రేక్షకులు బాగా ఆకర్షితులయ్యారు. ఇక వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ నడుస్తుంది అని అనుకున్నారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో శ్రీముఖి బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ అడుగు దూరంలో టైటిల్  గెలవలేక పోయింది. ఇక బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవితో పటాస్ ప్రోగ్రాం మళ్లీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీముఖి మాత్రం పటాస్ కి మళ్ళీ రాకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ అయిందని బ్రేకప్ అయింది అంటూ మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. 

 

 

 అయితే వీరిద్దరూ కలిసి ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ మధ్య  ఉన్న రిలేషన్ షిప్ ఏంటి అన్న దానిపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. తాము పటాస్ ప్రోగ్రాం లో ఉన్నప్పుడు ఎంతో క్లోజ్గా మూవ్ అయ్యామని... ఎందుకంటే పటాస్ ప్రోగ్రాం లో ప్రేక్షకులను ఆకర్షించడానికి స్టేజ్ పైన అది  అవసరం కాబట్టి అలా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు . కానీ తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. మేమిద్దరం  అంత క్లోజ్ గా ఉన్నాము అంటే అది కేవలం షో కోసం మాత్రమేనని... కెమెరాస్ ఆప్ అయిన తర్వాత మామూలుగానే ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు ఇద్దరు.

మరింత సమాచారం తెలుసుకోండి: