భారత దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరువాత సొంతం గా ఓ చానల్‌ ను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఆ ఆలోచనకు కార్య రూపమే దూరదర్శన్‌. తొలి ప్రయత్నం గా ఐదు నిమిషాల న్యూస్‌ బులిటెన్‌ ను ప్రసారం చేశారు. ఆ బులిటెన్‌ కు పత్రిమా పూరి యాంకర్‌  గా వ్యవహరించింది. దీంతో ఆమె తొలి ఇండియన్‌ న్యూస్‌ రీడర్‌ గా రికార్డ్‌ లో నిలిచిపోయింది. పూరి ముందుగా ఆల్‌ ఇండియా రేడియో లో కొంత కాలం పని చేసింది. రేడీయో లో ఆమె గొంతు విన్న వారు బ్రాండ్‌ కాస్టింగ్ కోసమే ఆమె గొంతు పుట్టిందని భావించే వారు.

 

అదే సమయంలో భారత ప్రభుత్వం ఓ ఛానల్‌ ప్రారంబించాలని నిర్ణయించుకున్న సమయంలో తొలి యాంకర్‌ గా ప్రతిమా పూరిని సెలెక్ట్ చేశారు. అప్పట్లో ప్రసారాలు కొద్ది ప్రాంతాల్లోనే ఉండేవి. 1975 నాటికి భారత్‌ లోనే 6 ప్రధాన నగరాల్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తరువాత దూరదర్శన్ ప్రసారాలను విస్తరించిన పూరి చదివే న్యూస్ బులిటెన్‌ ను మాత్రం పెంచలేదు. అయితే ఆ కొద్ది రోజుల్లోనే ఆమె ఐకాన్‌ గా పేరు తెచ్చుకుంది. తెర మీద ఆమె కనిపించే తీరు, ఆమె గాత్రం అన్ని కలిసి యాంకర్‌ అంటే ఇలానే ఉండాలి అనే ఓ స్టాండర్ట్స్‌ ను సెట్ చేసింది.

 

తరువాత ఇంటర్వ్యూయర్‌ గానూ ఆమె పేరు తెచ్చుకుంది. యాంకర్‌ గా కెరీర్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో చిన్న వయసు వారిని యాంకర్లు గా తీసుకునే వారు కాదు పూరి తరువాత గోపాల్ కౌల్‌ యాంకర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత సుల్తానా యాంకర్‌ గా కెరీర్‌ ను ప్రారంభించింది. సుల్తాన ఎంట్రీ తరువాత పూరి యాంకరింగ్‌ కు దూరమైన కొత్త యాంకర్‌ లకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను తీసుకుంది. ఇలా ఇండియన్‌ టెలివిజన్‌ రంగానికి విశేష సేవలందించిన పూరి 2007లో మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: