కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిదిమేస్తోంది. వ్యవస్థలన్నీ స్తంభించిపోవడంతో జన జీవనం అస్తవ్యస్థమైపోతోంది. ఎంతోమంది పేదలు, రోజు వారీ కూలీలు, కార్మికుల జీవితాలు ఈ కరోనా మహమ్మారి దెబ్బకి కుదేలైపోతున్నారు. వీరిలో ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారు. జన జీవితం ఉంటేనే గానీ ఆదాయం, ఉపాధి ఉండని వీరు ప్రస్తుతం ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి పరిస్థితికి అర్ధం చేసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల హైదరాబాద్ లోని ట్రాన్స్ జెండర్లకు తన వంతు సాయం అందించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

IHG

 

పబ్లిసిటీకి దూరంగా శేఖర్ కమ్ముల చేసిన సాయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ట్రాన్స్ జెండర్ రచనా ముద్రబోయిన ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి అందరికీ తెలిసేలా చేశారు. ‘శేఖర్ కమ్ముల సర్.. ఆపత్కాలంలో సాయం చేయడం ఎంత మానసిక ప్రశాంతతగా ఉంటుందో మీరు నిరూపించారు. లాక్ డౌన్ వల్ల పని, సంపాదన లేకపోవడం వల్ల ట్రాన్స్ జెండర్లు పడుతున్న అవస్థలను గుర్తించి మీరు చేసిన సాయం మరువలేనిది. టాలీవుడ్ నుంచి మరింత సాయం చేస్తారని ఆశిస్తున్నాం’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ట్రాన్స్ విషన్ పేరుతో రచన యూట్యూబ్ చానెల్ రన్ చేస్తున్నారు.

IHG

 

శేఖర్ కమ్ముల సాయానికి స్పందించిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మంచి పని చేశారు శఖర్ గారూ’, ‘ఈ సమయంలో వారిని ఆదుకోవడం సంతోషం’, ‘మేమూ సాయం చేస్తాం’ అంటూ పలువురు ముందుకొస్తున్నారు. ఈ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. అన్నదానం చేయడం, నిత్యావసరాలు పంపిణీ చేయడం, విరాళాలు ఇవ్వడం వంటి చారిటీతో తమ ఉన్నత మనస్తత్వం చాటుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: