మెగా ఫ్యామిలీ నుండి సినీరంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తన 25 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో రీమేక్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. తాను మొట్ట మొదటి గా 1996 లో నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హిందీలో అమీర్ ఖాన్ హీరోగా నటించిన "ఖయామత్ సే ఖయామత్ తక్" కు రీమేక్ కాగా... దానిని ఈవీవీ సత్యనారాయణ కాస్త మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరిగా వసూళ్లు రాబట్టింది కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆ సినిమా ఒక పెద్ద హిట్ అని అభిమానులు అంటుంటారు.


పవర్ స్టార్ కథానాయకుడిగా నటించిన గోకులంలో సీత కూడా 'గోకులతిల్ సీతై’ అనే తమిళ సినిమాకు రీమేక్ కాగా... ఆ సినిమాలో కార్తీ హీరోగా నటించాడు. గోకులంలో సీత చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం కూడా తమిళ చిత్రమైన 'లవ్ టుడే' కు రీమేక్ కాగా... అందులో విజయ్ దళపతి హీరోగా నటించాడు. నిజానికి సుస్వాగతం మూవీ అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం. ఈ సినిమా కూడా అతని కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది.


తెలుగు ప్రేక్షకులను ఎంతో మెప్పించిన తమ్ముడు సినిమా కూడా ఆల్రెడీ బాలీవుడ్ లో మొదటగా తీసిన సినిమా నేనట. ఆమిర్ ఖాన్ నటించిన "జో జీతా వహీ సికందర్" కు 'తమ్ముడు' సినిమా రీమేక్ కాగా... హిందీలో హీరో సైకిల్ కాంపిటీషన్ లో పాల్గొంటే... తెలుగులో పవన్ బాక్సింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటాడు. ఇక మిగతా కథ అంతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ ని తలచుకోగానే తమ్ముడు సినిమా ఎవరికైనా గుర్తొస్తుంది. దీన్ని బట్టి చూస్తే తమ్ముడు సినిమా ఎంత హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.


ఖుషి... పవన్ కళ్యాణ్ సినీ చరిత్ర లో ఓ ప్రేమ కళాఖండంగా మారిపోయిన ఈ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. భూమిక చావ్లా పవన్ కళ్యాణ్ మధ్య చోటు చేసుకున్న ప్రేమ సన్నివేశాలు నేరుగా మనసుని తాకేట్లు ఉంటాయి. నిజానికి ఈ సినిమా కూడా తమిళంలో ఆల్రెడీ తెరకెక్కించినదేనట. విజయ్ దళపతి హీరోగా నటించిన కుషి చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఖుషి గా ఒరిజినల్ డైరెక్టర్ ఎస్ జే సూర్య మళ్లీ తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.

 

అన్నవరం కూడా తిరుపాచి అనే తమిళ సినిమా యొక్క రీమేక్. తీన్ మార్ చిత్రం హిందీ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ చిత్రానికి రీమేక్. గబ్బర్ సింగ్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాకి రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా హిందీ లో రిలీజ్ అయిన ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్. కాటమరాయుడు చిత్రం అజిత్ నటించిన వీరం సినిమాకి రీమేక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కూడా అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ నటించిన పింక్ చిత్రానికి రీమేక్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: