ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్లలో నాలుగో వాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు అక్షయ్ కుమార్. సో కాల్డ్ బాలీవుడ్  స్టార్ హీరోల లిస్ట్ లో లేడు అక్షయ్. అందులో సో కాల్డ్ కమర్‌షియల్ సినిమాలను అస్సలే చెయ్యడు. అందుకే అందరికన్నా డిఫరెంట్ ఈ హీరో. బాలీవుడ్‌ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ స్టైలే వేరు. అక్కడే కాదు ఇండియా వైడ్ గా  ఈ హీరోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే టాప్ బ్రాండ్స్ అన్నీ ఈ హీరో దగ్గరకే ప్రమోషన్ల కోసం వస్తాయి. అంతేకాదు.. కోరినంత రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటాయి. అందుకే.. ప్రపంచంలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్లలో ఫోర్త్ ప్లేస్ కొట్టేసి ఫోర్బ్స్ లిస్ట్ లో రికార్డ్ క్రియేట్ చేశాడు.

 

బాలీవుడ్ లో 2018-2019 సంవత్సరానికి  అక్షయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 4 వందల 66 కోట్లు.  అక్షయ్ సినిమాకి 40 నుంచి 70 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. సంవత్సరానికి మినిమం 3 సినమాలు చేస్తాడు. ఇక  టాప్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయ్యడంతో కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ యాడ్ అవుతుంది. 2018 లో ప్యాడ్ మ్యాన్, గోల్డ్ , రోబో 2.0 సినిమాలు చేశాడు. ప్యాడ్ మ్యాన్ దాదాపు 210 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ లోనే హ్యయస్ట్ కలెక్ట్ చేసిన 10 వ మూవీగా 2018 లో రికార్డ్ క్రియేట్ చేసింది.

 

2019 లో రిలీజ్ అయిన కేసరి సినిమా.. వరల్డ్ వైడ్ గా 205 కోట్లు కలెక్ట్ చేసింది.  ఆ దెబ్బతో వరుసగా మళ్లీ సినిమాలు  రిలీజ్ చేస్తూనే ఉన్నాడు అక్షయ్ కుమార్ . అసలుఒక్క సినిమా చెయ్యడానికే ఆపసోపాలు పడుతున్న బాలీవుడ్ హీరోలున్న ఈ జనరేషనలో  సంవత్సరానికి మినిమం 3 సినిమాలు ఈజీగా చేసేస్తాడు అక్షయ్.  ఇలా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తాడు కాబట్టే.. అంత డబ్బు సంపాదిస్తాడనుకుంటారు అందరూ.కానీ ప్రతి సినిమా ఎంతో కొంత సోషల్ ఇంట్రస్ట్ తో , మెసేజ్ తో చేస్తాడు అక్షయ్ కుమార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: