జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వేరే సినిమాల్లో నటించడానికి లేకుండా రాజమౌళి లాక్ చేసేశాడు. అయితే ఆర్ ఆర్  ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించే సినిమాల గురించి ఇప్పుడే చర్చ జరుగుతోంది.

 

ఆల్రెడీ ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పేశాడు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అదీ గాక ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత చేయబోయే సినిమా కాబట్టి త్రివిక్రమ్ పై మరింత బాధ్యత పెరగనుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా గురించి అనేక కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ముందుగా ఈ సినిమాని పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా కనిపించనున్నాడని చెబుతున్నారు. చిత్ర బృందం నుండి ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం రానప్పటికీ ఈ కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమా పట్ల త్రివిక్రమ్ కి భయం పట్టుకుందట.

 

జనరల్ గా రాజమౌళి తో సినిమా చేసిన హీరో తర్వాతి చిత్రం ప్లాపు అవుతూ వస్తుంది. రాజమౌళి చాలా సినిమాలకి ఈ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. అదే ఇప్పుడు త్రివిక్రమ్ కి భయం అవుతుందట. అందుకే త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ తో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తెరకెక్కిస్తాడట. అయితే రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ఈ సినిమాకి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: