సడెన్ గా సో కాల్డ్ హీరో నుంచి కొత్తగా తనను తాను ప్రజెంట్ చేస్కోడానికి చాలా కష్టపడుతున్నాడు బన్నీ. బన్నీతో పాటు పుష్ప కూడా తెగ కష్టపడుతోందట. బన్నీ సుకుమార్ తో చేస్తున్న  సినిమా  మీదే ఇప్పుడు అందరిక కానస్ న్ ట్రేషన్. పుష్ప అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో  అల్లు అర్జున్.. ఎవ్వరూ ఊహించని లుక్ లో కనిపించి ఆడియన్స్ ని సర్ ప్రైజజ్ చేశాడు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న స్టోరీ అని ముందు నుంచి  టాక్ నడుస్తున్నా.. ఈ సినిమాలో లుక్స్ తో కంప్లీట్ గా మేకోవర్ అయిపోయాడు అల్లు అర్జున్.

 

కెరీర్ లో ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోగాలు చెయ్యని బన్నీ.. పుష్ప తో సర్ ప్రైజ్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో చిత్తూరు బ్యాక్ డ్రాప్ స్మగ్లర్ గా కనిపించనున్నాడు బన్నీ. అందుకోసం చిత్తూరు స్లాంగ్ నేర్చుకుంటున్నాడు. ఇప్పటివరకూ డైలాగ్ డెలివరీలో తన దైన స్టైల్ చూపించిన బన్నీ.. ఇప్పుడు రాయలసీమ చిత్తూరు మాడ్యులేషన్ ని ఎడాప్ట్ చేస్కోడానికి  ఆ పుస్తకాలు చదువుతూ.. ఆ మాటల్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు .

 

ఇప్పటి వరకూ తెలంగాణ, కోస్తా మాడ్యులేషన్ లో డైలాగ్స్ చెప్పిన బన్నీ.. పుష్ప సినిమాలో  లో సరికొత్త డైలాగ్స్ ని డెలివర్ చెయ్యబోతున్నాడు. బన్నీతో పాటు హీరోయిన్ గా చేస్తున్న రష్మిక కూడా  చిత్తూరు స్లాంగ్ , మాడ్యులేషన్ కోసం  తెగ ట్రై చేస్తోందట. అసలు తెలుగు మాట్లాడటమే సరిగా రాని ఈ కన్నడ భామ ఇప్పుడు ఏకంగా చిత్తూరు యాస లో ఇంట్రస్టింగ్ గా మాట్లాడబోతోంది. ఎందుకంటే... ఈ మద్య రష్మిక తన డబ్బింగ్ తనే చెప్పుకుంటోంది. కాబట్టే మరింత సీరియస్ గా ఈ యాస నేర్చుకుంటోందట.

 

అంతేకాదు .. ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇప్పుడు ఇంకో లెక్క అంటోంది రష్మిక. కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినా.. డిఫరెంట్ గా పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అందుకే లుక్ నుంచి మాడ్యులేషన్ వరకూ అన్నీ ప్రయోగాలే కాబట్టి.. ఈ సినిమాలో నన్ను ఎప్పుడూ చూడనంత కొత్తగా చూస్తారు అంటూ ఆడియన్స్ కి ఇంట్రస్ట్ కూడా క్రియేట్ చేస్తోంది రష్మిక. మరి వీళ్ల పర్ ఫామెన్స్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: