ఇదిగో ఇప్పుడు  స్టార్ట్ అవుతోంది..అప్పుడు స్టార్ట్ అవుతోంది అని అందరూ ఆశపడడం తప్పించి ఇప్పుడప్పుడే ధియేటర్లు మొదలై..సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు . అందుకే మేకర్స్ అందరూ  మిస్ అయిన సమ్మర్ సీజన్ మీద ఆశలు వదిలేసుకుని దసరా మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు .

 

కరోనా దెబ్బతో సినిమాలకు సమ్మర్ సీజన్ లేకుండా పోయింది.  సమ్మర్ కి రిలీజ్ అని ప్లా న్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకి ఆగిపోయాయి. మొన్నటి వరకూ ఏప్రిల్  మిస్ అయిన సినిమాలు మే లో రిలీజ్ అనకున్నాయి. కానీ ..ఇప్పుడప్పుడే సినిమాలు రిలీజ్ అయ్యే ఛానస్ కనిపించడం లేదు కాబట్టి .. ఇక అందరూ ఈ సమ్మర్ సీజన్ మీద ఆశలు వదిలిపెట్టేసుకుని .. సనిమాలకు మరో సీజన్ అయిన దసరా మీద కన్నేశారు. 

 

ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అంటే నాని వి సినిమా, రానా ఉప్పెన , నాగచైతన్య లవ్ స్టోరీ, అనుష్క నిశ్బబ్దం సినిమాలు ఈ మార్చి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు . ఈ సినిమాలతో పాటు రామ్ రెడ్ , సాయిధరమ్ సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలు కూడా ఏప్రిల్ లాస్ట్ , మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు . కానీ లాక్ డౌన్ తో ఇవన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. లాక్ డౌన్ తీసేస్తే .. ఒక నెలా అటూ ఇటూగా ఇవన్నీ నెలలోపే రిలీజ్ అయిపోతాయి.

 

చిన్న సినిమాలు నెలలోపే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో..కానీ పెద్ద సినిమాలు మాత్రం సమ్మర్ నష్టాలు పూడ్చుకోడానికి  ఇంకా 4,5 నెలలు ఉంది కాబట్టి దసరా వైపు చూస్తున్నాయి. . అందుకే ఈ సినిమాలన్నీ పెద్ద సీజన్ అయిన దసరా మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నార కాబట్టి దసరాకు పెద్ద పోటీ కనిపిస్తోంది. దసరాకు పోటీ పడుతున్న సినిమాల్లో మెగాస్టార్కొరటాల ఆచార్య సినిమా ఉంది. ఎట్టి పరిస్తితుల్లో ఈ దసరాకు ఆచార్యను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి.

 

దసరాకు రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న మరో సినిమా కెజిఎఫ్. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ ప్యాన్ ఇండియా మూవీ పై ఎక్స్ పెక్టేషనస్ ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కలెక్షన్లను బీట్ చెయ్యలంటే దసరాకు రిలజ్ చెయ్యక తప్పని పరిస్తితి. ఎందుకంటే ..దసరా తర్వాత మళ్లీ సంక్రాంతి వరకూ ఆగాల్సిందే . లేకపోతే ఓపెనింగ్స్ లో భారీ దెబ్బ పడడం ఖాయం

మరింత సమాచారం తెలుసుకోండి: