ప్రస్తుత బుల్లితెర యాంకర్లు సినీ హీరోల లెవల్లో తమ జీవితాలను విలాసవంతముగా లీడ్ చేస్తున్నారు అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాస్త పాపులారిటీ సంపాదించిన ఫిమేల్, మేల్ యాంకర్లు కూడా ప్రతి ఒక్క ఈవెంట్ కి, టీవీ షోలకు, ఆడియో ఫంక్షన్ లకి లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈ కోవలోకే జబర్దస్త్ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ కూడా వస్తాడు. హాస్యభరితమైన కార్యక్రమం జబర్దస్త్ లో కొన్ని సంవత్సరాలలోనే తిరుగులేని హాస్య నటుడిగా పేరొందిన సుధీర్... ఆ తర్వాత టీవీ వ్యాఖ్యాతగా పలు కార్యక్రమాలకు బాధ్యతలు నిర్వహిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదించడం మొదలెట్టాడు. సుధీర్ తన కో-యాంకర్ల తో నడిపించే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రష్మి గౌతమ్ తన మధ్య చోటుచేసుకునే ఆన్ స్క్రీన్ రొమాంటిక్ సన్నివేశాలు విపరీతంగా పండుతాయి.


ఆన్ స్క్రీన్ మీద రష్మీ గౌతమ్ ని చూసి సొంగ కార్చుకున్నంతమాత్రానా వారిద్దరి మధ్య నిజంగానే ఏదో జరుగుతుందని ఊహాగానాలు చేసుకోవడం పొరపాటేనని సాక్షాత్తు సుధీరే ఎన్నో సందర్భాలలో తెలిపాడు. ఐతే ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేసే వారితో సుధీర్ కి ఎటువంటి సంబంధాలు లేకపోయినా... బయట మాత్రం ఫారెన్ గర్ల్స్ తో రొమాంటిక్ అఫైర్స్ ఉన్నాయని వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్త ఎంతగా నెట్టింట దుమారం రేపిందంటే... సాక్షాత్తూ సుధీరే ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.


విదేశీ వనితలతో గాఢమైన లవ్వాయణం నడిపేంత సీన్ లేదని, అస్సలు అది అసాధ్యమని, కనీసం ఇంతవరకు ఓ విదేశీ వనిత తో వ్యక్తిగత పరిచయం కూడా ఏర్పడలేదని సుధీర్ తెలిపాడు. తాను ఎప్పుడూ సింగల్ గానే ఉంటానని, అందరిని లవ్ లో పడేస్తానని కానీ ఎవరి లవ్ లో పడే ఛాన్స్ ఉండదని ఆయన అన్నారు. ఏదో ప్రోగ్రామ్ యాజమాన్యం డిమాండ్ కొరకు తాను ఆడవారి వెంటపడతానని నిజ జీవితంలో తన క్యారెక్టర్ అది కాదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సుడిగాలి సుధీర్ కి త్వరగా పెళ్లి అయితే చూడాలని ఎంతో మంది అభిమానులు వేచిచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: