ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల్లోనూ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా దేశ‌దేశాలు పాకేసింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు చేరువలో కేసులు ఉండగా కోవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు మించిపోయింది. అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.

 

అందులో భార‌త్ కూడా ఒక‌టి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ‌రియు షూటింగ్స్ లేక ఎంద‌రో సినీ కార్మికులు ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే విపత్కర సమయాల్లో తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని మారు టాలీవుడ్ సినీ ప్రముఖులు నిరూపించుకున్నారు. ఈ క్ర‌మంలోనే హీరోలంతా తమకి తోచిన  భారీ విరాళాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చారు. అయితే పాన్ ఇండియా లెవల్ కి వెళుతున్న విజయ్ దేవరకొండ మాత్రం ఒక్క రూపాయి విరాళం ఇవ్వలేదు.. దాంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కున్నాడు.

 

అయిన‌ప్ప‌టికీ వాటి ఏ మాత్రం స్పందించ‌లేదు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కానీ, తాజాగా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స్థార్ హీరోల‌కు షాక్ ఇస్తూ భారీ విరాలాన్ని ప్ర‌క‌టించాడు. విజ‌య్  తాజాగా 1.30 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. అంతేకాదు ఇలాంటి విపత్క‌ర ప‌రిస్థితుల‌లో సామాన్య‌లుకి సాయం అందించ‌డానికి.. ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి డి ఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎం సి ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స్టార్ట్ చేసి శ‌‌భాస్ అనిపించుకున్నాడు. ఒక కోటి రూపాయలతో మొదలైన టి డి ఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారట. 

 

అలాగే ఈ క‌రోనా సంక్ష‌భంలో తినడానికి తిండి కూడా లేక‌ ఇబ్బంది పడుతున్న వారికోసం మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేశారు. 25లక్షల రూపాయలతో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ ద్వారా కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారి కోసం అని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. ఇక‌ https://thedeverakondafoundation.org లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తార‌ని విజ‌య్ తెలిపారు. ఏదేమైనా విజ‌య్ ఆలోచ‌న‌కు ఎవ‌రైనా మెచ్చుకోవాల్సిందే అనిపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: