కోలీవుడ్ స్టార్ యాక్టర్ సముద్రఖని ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ - గోపిచంద్‌ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను', 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'క్రాక్' సినిమాతో హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని  సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. రవితేజ గత చిత్రాలు వరుసగా ప్లాప్ అవడంతో 'క్రాక్' సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడని చెప్పవచ్చు.

 

కాగా స‌ముద్ర‌ఖ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలో 'క‌టారి' పాత్ర‌లో న‌టిస్తోన్న స‌ముద్ర‌ఖ‌ని లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసి శుభాకాంక్షలు తెలిపారు. 'క్రాక్' సినిమాలో సముద్రఖని పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఈ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతోంది. చేతిలో కత్తి పట్టుకొని ఓల్డ్ గెటప్ లో గంభీరంగా కనిపిస్తున్న సముద్రఖని విలన్ పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో రవితేజ హీరోగా నటించిన ‘శంభో శివ శంభో’లో చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ వెర్షన్ లకు ఆయనే దర్శకుడు కావడం విశేషం. సముద్రఖని ఆ తర్వాత ‘రఘువరన్’, 'వి ఐ పి' చిత్రాల్లో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది రిలీజైన 'అల వైకుంఠపురంలో' సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించాడు. ప్రస్తుతం 'క్రాక్'తో పాటు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలోనూ నటిస్తున్నాడు. 

 

IHG's Rugged Look In <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KRACK' target='_blank' title='krack-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>krack</a> | Latest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> ...

మరింత సమాచారం తెలుసుకోండి: