టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సినిమా ఎ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఈ సినిమా ముందు ఈ సినిమా తర్వాత అనుకునే విధంగా ఉంది. ఆ స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ తన కెరీర్ లో 5 ఏళ్ళు వదులుకున్నారు. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయడానికి దాదాపు రెండేళ్ళ వరకు ఎదురు చూసారు కూడా. ఆ స్థాయిలో ఈ సినిమా కోసం ప్రభాస్ కష్టపడ్డాడు అనే విషయం అందరికి తెలిసిందే. విలన్ గా నటించిన రానా అయినా రెండు మూడు సినిమాలు చేసాడు గాని ప్రభాస్ మాత్రం చేయలేదు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అతను ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఒక భారీ సినిమాను ప్రభాస్ , జక్కన్న తో చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా బాహుబలి సినిమా మాదిరి గానే ఉంటుందని అయితే అది కాస్త భిన్నంగా ఉంటుంది అని అంటున్నారు. బాలీవుడ్ లో జక్కన్న సినిమాలకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఎక్కువగానే ఉంటారు. 

 

ఈ సినిమాను ఒక ప్రముఖ నిర్మాతతో చెయ్యాలి అని భావిస్తున్నాడు అని టాక్. ఈ సినిమా విషయాన్ని ఇప్పటికే అతను చెప్పాడని దానికి జక్కన్న ఓకే చెప్తే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. కథ కూడా రెడీ గా ఉంది అనేది టాలీవుడ్ లో టాక్. ఆ కథ ఇప్పుడు తయారు చేసింది కాదట... బాహుబలి సమయంలో ఉందట. మరి వస్తుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: