తమన్నా భాటియా. పదిహేనేళ్ళ కెరీర్. టాలీవుడ్లో ఒక రేంజిలో తన గ్లామర్ ని ఉతికారేసిన ఫిగర్. కుర్రకారుకి వెర్రి కేక పెట్టించిన స్టామినా ఉన్న హీరోయిన్. ఇప్పటికీ నాటౌట్ అంటోంది. తన అందానికి ఎదురులేదని చెబుతోంది. అవుని నిజమే తమన్నా కావాలని ఇంకా పెద్ద డిమాండ్ ఉంది. క్యూలో సీనియర్ల నుంచి ఓ రేంజి హీరోలు ఉన్నారు కూడా.

 

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అదే ఆమె తన పెళ్ళిని వాయిదా వేసుకుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి తమన్నా పెళ్ళి బాజాలు ఈ ఏడాదితో మోగాల్సిందే. అయితే ప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మరో వైపు తమన్నా కూడా గత ఏడాది నుంచి పెళ్ళికి ప్రిపేర్ అవుతూనే ఉంది. 17 కోట్లు పెట్టి మరీ ముంబైలో భారీ ఫ్లాట్ కొనుక్కున్న తమన్నా ఓ ఇంటిది అయింది. ఇక జత కుదుర్చుకుని అసలైన ఇల్లాలు అవుతుందని అంతా అనుకున్నారు.

 

ఇక తమన్నా నోటి వెంట కూడా పెళ్ళి మాటలు వినిపించాయి. తనకు ప్రభాస్ లాంటి హీరో దొరికితే పెళ్ళి చేసుకుంటాను అంటూ ముచ్చట్లు పెట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని మరో వైపు ప్రచారం జరిగింది. ఇవన్నీ ఇలా ఉండగానే మరికొంతకాలం పెళ్ళిని వాయిదా వేసుకోవాలని తమన్నా ఆలోచిస్తోందిట. ఇపుడు ఈ టాక్ స్ప్రెడ్ అవుతోంది. 

 

తమన్నా అందుకే మళ్ళీ వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది అంటున్నారు. గోపీచంద్ మూవీ సిటీమార్ లో తమన్నా కబడ్డీ ప్లేయర్ గా నటిస్తోంది. అదే విధంగా వెంకటేష్ పక్కన అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీలో కూడా ఆమెనే తీసుకున్నారు. ఇవి కాక మరికొన్ని తెలుసు సినిమాలకు కూడా ఆమె సైన్ చేసిందని టాక్ వినిపిస్తోంది.

 

మరి తమన్నా ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో, ఆమె మూవీస్ లో ఎందుకు  కంటిన్యూ అవాలనుకుంటోందో తెలియడం లేదు కానీ తన గ్లామర్ తో ఇంకా వెలిగిపోవాలన్న ఉద్దేశ్యంతో తమన్నా ఇలా చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఆమె ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: