ప్రస్తుతం తెలుగులో కొందరు యువ దర్శకులు అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగులో. అయినా సరే వాళ్లకు ఆఫర్లు రావడం లేదు. వంశీ పైడపల్లి అగ్ర దర్శకుడు అయినా సరే ఆయన తో సినిమా చేయడానికి ఇప్పుడు కొందరు వెనకడుగు వేస్తున్నారు. దానికి కారణం ఏంటీ అనేది సరిగా ఎవరికి తెలియదు గాని ఆయన నుంచి ఫోన్ వచ్చినా సరే కొందరు మాత్రం సమాధానం కూడా చెప్పడం లేదు అనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. 

 

టాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఆయన. అయినా సరే పక్కన పెట్టడానికి ఒక అగ్ర హీరో కారణమని అంటున్నారు. ఒక అగ్ర హీరో ఆయనకు ఆఫర్ ఇచ్చి కథ రెడీ చేయమని చెప్పినా సరే వంశీ ముందుకు వచ్చి కథ రెడీ చేయలేదు అని టాక్. సమయం ఎక్కువ కావాలని చెప్పడమే కాకుండా మరో హీరో కథలో అతను బిజీ గా ఉన్నాడని ఇది సదరు హీరోకి అసలు నచ్చలేదు అని అంటున్నారు. అందుకే అతన్ని పక్కన పెట్టారు అనేది టాలీవుడ్ లో వినపడుతున్న మాట. 

 

చిన్న అవకాశం వస్తేనే అగ్ర హీరోలతో ఎంతో ఆసక్తి గా ఉంటారు కొందరు. అయినా సరే వంశీ మాత్రం కథను రెడీ చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు అని అందుకే ఆయన్ను పక్కన పెట్టారని వేరే వాళ్ళు ఎవరు కూడా ఆయనకు ఆఫర్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం వంశీ ఒక సినిమాను అల్లు అర్జున్ తో ప్లాన్ చేసినా సరే లాభం లేకుండా పోయింది అనే మాట వినపడుతుంది. మరి నిజమో కాదో.

మరింత సమాచారం తెలుసుకోండి: